కొత్త రుణాలు
ఈ విషయమే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో అర్హులైన 1,32,000 మంది రైతులలో 49 వేల మంది రైతులు రూ.325 కోట్ల రుణమాఫీ పొందారని, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 87,402 మంది రైతులు అర్హులు ఉండగా వీరిలో 41,400 మంది రైతులు రూ.224 కోట్ల రుణమాఫీ పొందారన్నారు. అసిఫాబాద్ జిల్లాలో 67,000 మంది రైతులలో 39 వేల మందికి రూ.199 కోట్లు రుణమాఫీ లభించింది. నిర్మల్ జిల్లాలో 1,10,000 మంది అర్హులు ఉండగా 52,000 మంది రైతులు 319 కోట్ల రూపాయలు రుణమాఫీ పొందారు. వీరందరికీ కొత్త రుణాలు త్వరలోనే బ్యాంకు ఖాతాలో జమవుతాయని వివిధ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త రుణాలు అందించాలని రైతులు వేడుకుంటున్నారు.