Top Stories

రిటర్న్ గిఫ్ట్ దేవుడెరుగు.. మీ నాన్న గెలిచేది చూసుకో!


కీల‌క స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాకుండా, ఢిల్లీ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న లోకేశ్‌… మాట‌లు మాత్రం కోట‌లు దాటేలా ఉన్నాయ‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. రాజ‌ధాని ఇన్న‌ర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని లోకేశ్‌పై సీఐడీ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై కేసు న‌మోదు చేయ‌డాన్ని లోకేశ్ త‌ప్పు ప‌ట్టారు. జ‌గ‌న్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని లోకేశ్ హెచ్చ‌రించారు.

ఈ హెచ్చ‌రిక‌పై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సీరియ‌స్‌గా స్పందించారు. పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌డం దేవుడెరుగు… ముందు మీ నాన్న‌ను కుప్పంలో గెలిచేది చూసుకోవాల‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కుప్పంలో వైసీపీ బ‌లంగా ఉంద‌ని, తామే గెలుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులే గెలుస్తార‌ని మంత్రి ధీమా వ్య‌క్తం చేశారు.

జ‌నంలో త‌మ పార్టీపై సానుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు.  స‌ర్వేల‌న్నీ వైసీపీకి సానుకూలంగా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంద‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌న్న ఆరోప‌ణ‌ల్ని ఆయ‌న కొట్టి పారేశారు. త‌మ ప్ర‌భుత్వానికి ఎవ‌రిపైనా క‌క్ష సాధింపు లేద‌న్నారు.

స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబునాయుడికి ప్ర‌మేయం వుంది కాబ‌ట్టే సీఐడీ అరెస్ట్ చేసింద‌ని మంత్రి పెద్దిరెడ్డి స్ప‌ష్టం చేశారు. కక్ష సాధింపులో భాగంగా చంద్ర‌బాబునాయుడిని జైలుకు పంపాల్సిన అవ‌స‌రం త‌మ ప్ర‌భుత్వానికి  లేద‌న్నారు.  ప్ర‌జాధ‌నం దుర్వినియోగానికి పాల్ప‌డితే ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

కుప్పం నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ బాధ్య‌త‌ల్ని మంత్రి పెద్దిరెడ్డి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా చంద్ర‌బాబును కుప్పంలో ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో పెద్దిరెడ్డి ఉన్నారు. ప్ర‌తి గ‌డ‌పా ఆయ‌నే తొక్కుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. వైసీపీకి అనుకూల ప‌రిస్థితుల్ని తీసుకొచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు.



Source link

Related posts

తెదేపా ఇంకా బతికుందనే అనుకోవాలా?

Oknews

అల‌క వీడిన వైసీపీ ఎమ్మెల్యే!

Oknews

బాబు కేసుల‌పై మ‌రో రెండు రోజులు టెన్ష‌న్‌

Oknews

Leave a Comment