EntertainmentLatest News

అనూహ్య విజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి పదేళ్ళు!


ప్రస్తుతం భారీ బడ్జెట్‌ సినిమాలకు లీకుల బెడద ఎక్కువైన విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో విధంగా సినిమాకి సంబంధించి ఏదో ఒక కంటెంట్‌ బయటకు వస్తూ నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇది ఇప్పటి సమస్య కాదు, పది సంవత్సరాల క్రితమే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ లాంటి స్టార్‌ హీరోకి కూడా ఎదురైంది. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 50 కోట్ల బడ్జెట్‌తో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి సంబంధించిన కంటెంట్‌ చాలా వరకు బయటికి వచ్చేసింది. అందరి ఫోన్లలో ఈ సినిమా ప్లే అయిపోయింది. 

ఆ తరుణంలో వేగంగా నిర్ణయం తీసుకున్న నిర్మాత సెప్టెంబర్‌ 27, 2013లో చిత్రాన్ని రిలీజ్‌ చేసేశారు. థియేటర్లకు రాకముందే లీకైన సినిమాను పూర్తిగా చూసేశారు చాలా మంది. ఆ పరిస్థితుల్లో విడుదలైన ఈ సినిమా నిలబడుతుందా? జనం థియేటర్స్‌కి వస్తారా? అందరూ సందేహిస్తున్న సమయంలో అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకొని, కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. పవన్‌కళ్యాణ్‌ ప్రజెన్స్‌, త్రివిక్రమ్‌ మాటల గారడీ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. చక్కని కుటుంబ కథాంశం తీసుకొని దానికి అన్ని హంగులు అద్ది త్రివిక్రమ్‌ సినిమాని తెరకెక్కించిన తీరు అందరి చేతా శభాష్‌ అనిపించుకుంది. ఒక కమర్షియల్‌ సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉండడంతో అన్నివర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని హీరోగా ఎలివేట్‌ చేసిన పవర్‌ఫుల్‌ సీన్స్‌ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాయి. అంతేకాదు దేవిశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్‌ అయింది. త్రివిక్రమ్‌ పంచ్‌ డైలాగులు, బ్రహ్మానందం టెరిఫిక్‌ కామెడీ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. హీరోయిన్లు సమంత, ప్రణీతల గ్లామర్‌ సినిమాకి కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. 

సినిమాలో దమ్ము ఉంటే దాని కంటెంట్‌ బయటికి వచ్చినా థియేటర్లలో దుమ్ము రేపుతుందని చాటి చెప్పిన సినిమా ‘అత్తారింటికి దారేది’. సినిమాకి అంత డ్యామేజ్‌ జరిగినా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కృంగిపోకుండా ధైర్యంగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేశారంటే దానికి త్రివిక్రమ్‌ మీద ఉన్న నమ్మకం, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కు ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో ఉన్న విపరీతమైన ఫాలోయింగ్‌ కారణం. నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం నేటితో పదేళ్ళు పూర్తి చేసుకుంది. 



Source link

Related posts

లారెన్స్ తమ్ముడిపై లైంగిక ఆరోపణలు, లాడ్జిలకు రమ్మని నీచంగా!! జూనియర్ ఆర్టిస్ట్ సంచలనం

Oknews

Krithi Shetty belly dance viral బేబమ్మ బెల్లీ డాన్స్

Oknews

BRS Leader Balka Suman Responds on Police Notice Comments against Revanth Reddy | Telangana: రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్, ఇంతకంటే గొప్పగా ఆశించలేం!

Oknews

Leave a Comment