Entertainment

‘బాహుబలి’ నిర్మాత సీరియస్‌.. విగ్రహంపై స్పందించిన నిర్వాహకులు!


‘బాహుబలి’తో పాన్‌ వరల్డ్‌ హీరో అయిపోయిన ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇక మేడమ్‌ టుసాడ్స్‌ మ్యూజియం వారు ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని తమ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఇక మనదేశంలో ప్రభాస్‌కి దక్కిన గౌరవం మైసూర్‌ మ్యూజియంలో అతని విగ్రహం ఉంచడం. అయితే ఈ విగ్రహం పలు వివాదాలకు, పలు విమర్శలకు దారి తీసింది. 

అయితే ఇది నిన్నో, మొన్నో జరిగిన విషయం కాదు, మూడేళ్ళ క్రితం మాట. అంటే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్‌ విగ్రహాన్ని పెట్టిన సమయంలోనే మైసూర్‌ మ్యూజియంలో కూడా మైనపు విగ్రహాన్ని పెట్టారు. ఓ టూరిస్ట్‌ ఈ ఫోటోను తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతను అలా చేయకపోయి ఉంటే… ఈ దారుణం అందరికీ తెలిసేది కాదు. ప్రభాస్‌ విగ్రహాన్ని చూసిన అభిమానులు షాక్‌ అయ్యారు. వారితోపాటు నెటిజన్లు కూడా ఖంగు తిన్నారు. ప్రభాస్‌ ఏమిటి ఇలా ఉన్నాడు? అసలు ఆ విగ్రహంలో ప్రభాస్‌ పోలికలు ఉన్నాయా? అంటూ కామెంట్‌ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు అతను క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌లా ఉన్నాడంటూ కామెంట్‌ చేశారు. 

ఈ వ్యవహారం బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ వరకు వెళ్లింది. విగ్రహాన్ని చూసిన శోభు అసహనానికి లోనయ్యారు. మ్యూజియంలో ఉన్న మైనపు విగ్రహం నాణ్యంగా లేదని, అది బాహుబలి ప్రభాస్‌లా కనిపించడం లేదు అంటూ విమర్శించారు శోభు. అంతే కాదు, మైనపు విగ్రహాన్ని తొలగించాలని మ్యూజియంకు ఫోన్‌ చేసి కోరారు శోభు. ఈ వ్యవహారం మరీ ముదరకముందే మేలుకొంటే మంచిదని భావించిన  నిర్వాహకులు సోమవారం ప్రభాస్‌ విగ్రహాన్ని మ్యూజియం నుంచి తొలగించారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. 



Source link

Related posts

జగన్ ఓటమిలో రాజమౌళి కూడా ఒక భాగం

Oknews

సాయిపల్లవితో మళ్ళీ సినిమా చేయకపోవడానికి రీజన్‌ అదేనంటున్న వరుణ్‌!

Oknews

హనుమాన్ కోసం 75  సినిమాలని వద్దనుకున్నా

Oknews

Leave a Comment