Latest NewsTelangana

Nalgonda’s Political Leaders’ Attempts To Dominate Mother Dairy Are Becoming Controversial. | Mother Dairy Issue : మదర్ డెయిరీపై ఆధిపత్యం కోసం ఎత్తలు


Mother Dairy Issue  : నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం మదర్ డైరీలో వివాదాలు రచ్చకెక్కాయి. డైరెక్టర్ల పదవుల కోసం ఎమ్మెల్యేలు పోటీ పడటం వివాదాస్పదం అవుతోంది. కోఆపరేటివ్ చట్టానికి వ్యతిరేకంగా బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఆశావహులు ఆందోళనకు దిగారు. మదర్ డైరీ ఎలక్షన్ జరిపించాలంటూ ఆందోళన బాటపట్టారు.  

మదర్ డెయిరీలో గుత్తా, మంత్రి జగదీష్ రెడ్డి జోక్యం 

మదర్ డైరీలో మంత్రి జగదీష్ రెడ్డి  పెత్తనం చెలాయిస్తూ రాబందులు డైరీగా మార్చేశారని కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనూ రెండు కోట్లకు చైర్మెన్ పదవిని అమ్ముకున్నారని ఆరోపించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిలు జోక్యం చేసుకుని ఓడిపోతామనే భయంతో ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన గుత్తా సుంఖేందర్ రెడ్డి, దివంగత నర్సింహారెడ్డి, గుత్తా జితేందర్ రెడ్డి మదర్ డైరీని అభివృద్ధి చేస్తే..ప్రస్తుత చైర్మెన్ బ్రష్టుపట్టించారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున రెండు పోస్టులను ఆలేరు అభ్యర్థులకే ఇస్తే రాజకీయ ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆశించారు. కానీ, అందుకు పోటీగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం కూడా డైరెక్టర్ పదవిని ఆశిస్తోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డిని డైరెక్టర్ గా చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యేల మధ్య పోటీ ఒక ఎత్తైతే  కాంగ్రెస్ నేత బీర్ల అయిలయ్య తన క్యాండిడేట్ ను డైరెక్టర్ పదవికి నిలబెట్టాలని చూస్తున్నారు.

కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య ప్రయత్నాలు

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 21 వరకు నామి నేషన్లను స్వీకరించాలి. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి ఫైనల్ లిస్టు ఈనెల 27 తేదీన ప్రకటించాల్సి ఉంది. అదే రోజున జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, ఎన్నికలు నిర్వహించాల్సింది, కానీ, సహేతుకమైన కారణాలు చూపకుండా బోర్డులోని 15 మంది డైరెక్టర్లు ఏకపక్షంగా తీర్మానం చేసి ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా ఆపేశారు. ఈనెల 30వ తేదీన మూడు డైరెక్టర్ల స్థానాలు ఖాళీ కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకటి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలి. రంగారెడ్డి జిల్లా పోస్టు రిజర్వు కేటగిరిలో ఉన్నందున మిగిలిన రెండు పోస్టుల కోసం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అత్యధిక సొసైటీలు ఆలేరు ని యోజకవర్గంలో ఉన్నందున రెండు డైరెక్టర్ల స్థానాలు తనకే కావాలని ఎమ్మెల్యే వర్గం పట్టుబడుతోంది.

నామినేషన్ల టైంలో ఎన్నికలు వాయిదా 

కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. రొటేషన్ సిస్టమ్ డైరెక్టర ఎన్నికలు జరపాలి. అలాగే ఆడిట్ రిపోర్ట్ ఆమోదం పొందాలి. ఇవేవీ జరగకపోతే మొత్తం పాలక మండలి రద్దవుతుంది. అంతేగాక మూడేళ్ల పాటు పాలక మండలిలోని 15 మంది డై రెక్టర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. ఒకవేళ ఎన్నికలు ఆపాల్సి వస్తే బలమైన కారణాలు చూపించాలి.  ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప ఎన్నికలు వాయిదా వేయడానికి వీల్లేదు. అది కూడా కోఆప రేటివ్ కమిషనర్ అనుమతి తీసుకున్నాకే ఎన్నికలు వాయిదా వేయాలి. కానీ, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, నామినేషన్లు తీసుకునే క్రమంలో ఉన్నపళంగా వాయిదా వేయడం సొసైటీ రూల్స్ కు పూర్తి విరుద్ధమని ఎన్నికల అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో చట్టప్రకారం డెయిరీ పాలకవర్గం మొత్తం రద్దయినటుగానే భావించాలని అధికారులు చెబుతున్నారు.



Source link

Related posts

అరుణ్ ఆదిత్య, అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

Oknews

IRCTC Ooty Coonoor Tour : 5 రోజుల ‘ఊటీ’ ట్రిప్

Oknews

తెలంగాణ ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. మే 9,10 ఇంజనీరింగ్, 11,12న అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రన్స్-telangana eap cet 2024 notification released may 9 10 engineering 11 12 agriculture pharma entrance ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment