మంగోలియా దేశంలో ఉపయోగించేందుకు అనువుగా గాసోలిన్ , డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ , ఎల్ పీ జీ తయారీకి ఉపయోగపడే 1. 5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను ఈ ప్రభుత్వ రంగ రిఫైనరీ ఉత్పత్తి చేస్తుంది. ఏ ఏ + రోబస్ట్ క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎంఈఐఎల్ ప్రపంచంలోనే అత్యాధునిక రిగ్గులను తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థ . బెల్జియం, ఇటలీ, చిలీ, అమెరికాలోని హౌస్టన్, తాజాగా తూర్పు మంగోలియాలో తన సేవలను అందిస్తోంది. హైడ్రోకార్బన్స్ విభాగంలో సెపరేషన్ యూనిట్స్, డిస్టిలేషన్, డిసాల్టింగ్ ప్లాంట్స్ ,గ్యాస్ డిహైడ్రాషన్ సౌకర్యాలు, గ్యాస్ కంప్రెషన్ ఇంస్టాళ్లషన్స్, గ్యాస్ పవర్ జనరేషన్ సెటప్స్ , స్టోరేజ్ ట్యాంక్ సిస్టమ్స్ , హైడ్రోకార్బన్ ఏఫ్ల్యూఎంట్ ట్రీట్మెంట్ సోలుషన్స్, స్ట్రక్చరల్, ప్లాంట్ పైపింగ్ పనులు మొదలైన వాటిని మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ వికల్ప్ పలివాల్ , మంగోలియా ఎం పీ టి ఇంక్ టు షాన్ , మంగోలియాలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సంజీవకుమార్ తదితరులు పాల్గొన్నారు.