Entertainment

పవన్ ,మహేష్ లపై కన్నడ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్  


కన్నడ చిత్ర సీమలో శివరాజ్ కుమార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దల  నుంచి తన అద్భుతమైన నటనతో కన్నడ సినీ ప్రేమికులనే కాకుండా యావత్తు భారతీయ చిత్ర పరిశ్రమని అలరిస్తూ వస్తున్నారు. తాజాగా కొంతమంది అభిమానులు శివన్నని ట్విట్టర్ వేదికగా తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ఇద్దరు అగ్రహీరోల మీద మీ ఒపీనియన్ ని చెప్పమని అడిగితే  శివన్న చెప్పిన సమాధానం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.

శివన్న ఈ మధ్యనే  రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ లో సూపర్ గా నటించి తన నటనకి ఉన్న శక్తీ ఎలాంటిదో అందరికి తెలియచేసాడు. ఇప్పుడు లేటెస్టుగా ఘోస్ట్ అనే సినిమాతో అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ కధానాయకుడు అనుపమ్ కేర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఇంక అసలు విషయానికి వస్తే..శివన్నని కొంత మంది అభిమానులు ట్విట్టర్ వేదికగా తెలుగు అగ్ర హీరోలు అయిన పవన్ కళ్యాణ్,మహేష్ బాబుల గురించి ఏమి చెప్తారని అడిగితే  శివన్న ఆ ఇద్దరి గురించి  చెప్పిన తీరు అందర్నీ విస్మయ పరిచింది. కన్నడ నాట అగ్ర హీరో శివన్న చెప్పిన ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు సినిమాని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడని ,చాలా తక్కువగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్తాడని మహేష్ ని తెర మీద చూడటం నాకు చాలా ఆనందంగా ఉంటుందని శివన్న చెప్పుకొచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి  శివన్న చెప్పిన మాటలు కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ తనకి ఎన్నో సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడని తను ఎప్పుడు చాలా హుషారుగా ఉంటాడని పవన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నాని చెప్పాడు. ఇలా మహేష్ ,పవన్ ల గురించి కన్నడ సూపర్ స్టార్  శివరాజ్ కుమార్   చెప్పడంతో ఇరువురి అభిమానులు  చాలా ఆనందపడుతున్నారు. 



Source link

Related posts

ఫ్రీగా చూడండి.. నచ్చుతుంది 

Oknews

పవన్ కళ్యాణ్ కి మంచు విష్ణు సన్మానం…

Oknews

తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Oknews

Leave a Comment