GossipsLatest News

Vijay Antony makes 1st public appearance after death విజయ్ ఆంటోని నిజంగా గ్రేట్



Fri 29th Sep 2023 10:17 AM

vijay antony  విజయ్ ఆంటోని నిజంగా గ్రేట్


Vijay Antony makes 1st public appearance after death విజయ్ ఆంటోని నిజంగా గ్రేట్

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఆంటోని రీసెంట్ గానే డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోని కుటుంభం మీరా ఆంటోని ఆత్మహత్యతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. కూతురు మరణంతో విజయ్ ఆంటోని ని ఓదార్చడం ఎవరితరం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని తన చేతులతో అంతక్రియలు చేసి ఆ బంధాన్ని దిగమింగుకున్న విజయ్ ఆంటోని కూతురు మీద ప్రేమతో ఇకపై ఏ సేవాకార్యక్రమం అయినా తన కూతురు మీరా పేరు మీదనే అంటూ.. తాను కూడా మీరా మరణంతో చనిపోయాను, నేను నా కూతురితో మాట్లాడుతున్నాను అంటూ ఎమోషనల్ గా రాసిన లెటర్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. 

అయితే తాజాగా విజయ్ ఆంటోని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోవడమే కాదు.. పొగుడుతున్నారు. అదేమిటంటే విజయ్ ఆంటోని నటించిన చిత్రమొకటి విడుదలకు రెడీ అవుతుంది, ఆ చిత్ర ప్రమోషన్స్ కోసం విజయ్ ఆంటోని తన కూతురు చనిపోయిన తొమ్మిదిరోజుల తర్వాత తన చిన్న కూతురు తో కలిసి పబ్లిక్ లోకి రావడం చూసి అందరూ నిజంగా విజయ్ ఆంటోని గ్రేట్ అంటున్నారు. 

ఈమధ్య కాలంలో చాలామంది హీరోలు ప్రమోషన్స్ వదిలేసి ఆ సినిమా దర్శకనిర్మాతలని ఇబ్బంది పెడుతుంటే విజయ్ ఆంటోని మాత్రం ఇంత బాధలోనూ ఇలా తన దర్శకనిర్మాతల కోసం ప్రమోషన్స్ కి రావడం చూసి అందరూ విజయ్ ని మెచ్చుకుంటున్నారు. 


Vijay Antony makes 1st public appearance after death:

Vijay Antony returns to work nine days after daughter death









Source link

Related posts

petrol diesel price today 03 February 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 03 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

Those five wild card entry in Bigg Boss 7 బిగ్ బాస్ 7 లోకి ఆ ఐదుగురు ఎంట్రీ

Oknews

Certificate Verification for pgt posts held on Febraury 10 and 11check venues here

Oknews

Leave a Comment