Top Stories

పోర్న్ సైట్స్ లో జాన్వి కపూర్.. స్పందించిన హీరోయిన్


హీరోయిన్ల ఫొటోల్ని, వీడియోల్ని మార్ఫింగ్ చేసి పోర్న్ సెట్స్ లో పెట్టడం చాలా కామన్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ వచ్చిన తర్వాత ఇది మరింత విసృంఖలంగా మారింది. దీనిపై హీరోయిన్ జాన్వి కపూర్ స్పందించింది. టీనేజ్ లోనే తను ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది.

"నేను, చెల్లి ఎక్కడికి వెళ్లినా మా అనుమతి లేకుండా ఫొటోలు తీసేవారు. కొన్నాళ్లకు అది మాకు అలవాటైంది నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరో నా ఫొటో తీశారు. కాబోయే హీరోయిన్ అంటూ వెబ్ సైట్స్ లో పెట్టారు. అది చూసిన తర్వాత చాలామంది స్నేహితులు నాకు దూరమయ్యారు. ఆ తర్వాత నా టీనేజ్ ఫొటో తీసి మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్ లో పెట్టారు."

ప్రస్తుతం ఏఐతో చాలామంది ఆడపిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపిన జాన్వికపూర్.. పోర్న్ సైట్స్ లో మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు చూసి చాలామంది నిజం అని భ్రమపడుతున్నారని చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు తనకు చాలా ఆందోళనగా ఉంటుందని అంటోంది ఈ హీరోయిన్

ఇంటర్నెట్ తో ప్రతికూల ప్రభావం కూడా ఉంటుందనే విషయాన్ని తను పదేళ్ల వయసులోనే తెలుసుకున్నానని, అప్పట్నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపింది జాన్వి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఆమెకిదే తొలి తెలుగు సినిమా.



Source link

Related posts

వెంకయ్య.. ఇంకా డొంకతిరుగుడు అవసరమా?

Oknews

తెలుగులో లియో రిలీజ్ అవుతుందా..?

Oknews

ఆ పర్వం పూర్తయ్యేదాకా జగన్ కోటరీలో కంగారే!

Oknews

Leave a Comment