చాలా మంది హీరోలకు జడ్జిమెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల కొన్ని సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అదే సినిమా మరో హీరోతో చేస్తే అది పెద్ద హిట్ అయి కూర్చుంటుంది. ఇలాంటి అనుభవాలు దాదాపు ప్రతి టాప్ హీరోకి ఉంటాయి. అయితే కొన్నిసార్లు తాము రిజెక్ట్ చేసిన సినిమా వేరే హీరో చేస్తే అది ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరోకి హిట్ ఇచ్చింది అనే వార్తనే ఎక్కువ లైక్ చేస్తారు.
విషయానికి వస్తే.. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల తొలి సినిమా ‘కొత్త బంగారులోకం’. వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా 2008లో విడుదలైన సెన్సేషనల్ హిట్ అయింది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే మిక్కీ జె.మేయర్ చేసిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉన్నట్టే ఈ సినిమా వెనుక కూడా ఒక కథ వుంది. అదేమిటంటే.. ‘కొత్త బంగారులోకం’ కథని మొదట నాగచైతన్య కోసం నాగార్జునకు వినిపించాడట శ్రీకాంత్ అడ్డాల. కథ నాగార్జునకు అంతగా నచ్చకపోవడం వల్ల దాన్ని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఇదే కథని రామ్ పోతినేనికి కూడా చెప్పాడట. రామ్ కూడా ఈ కథ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదట. దాంతో ఈ సినిమా చేసే అదృష్టం వరుణ్ సందేశ్‌కి దక్కింది. అప్పటికే ‘హ్యాపీ డేస్’ చిత్రం చేసి వున్న వరుణ్ సందేశ్ కెరీర్‌కి ‘కొత్త బంగారులోకం’ చాలా ప్లస్ అయింది.