Entertainment

బాలీవుడ్‌లో అయితే బట్టలిప్పేసి.. నా పేరుతో వ్యాపారం చేసేవారేమో!


బాలీవుడ్‌పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కమిట్‌మెంట్‌ పేరుతో అక్కడ జరిగే తంతు గురించి కంగనా రనౌత్‌ వంటి వారు కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. అదే దారిలో హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌ కూడా వెళ్ళి బాలీవుడ్‌లో అవకాశాలు రాకుండా చేసుకుంది. 2016లో ఆమె నటించిన బాలీవుడ్‌ సినిమా రిలీజ్‌ అయింది. అప్పటి నుంచి ఆమెకు అక్కడ సినిమా చేసే ఛాన్స్‌ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ బాలీవుడ్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తోంది పాయల్‌. 

2008లో ‘షార్ప్‌స్‌ పెర్ల్‌’ పేరుతో బిబిసి నిర్మించిన టెలిఫిల్మ్‌లో మొదటిసారి నటించిన పాయల్‌ ఆ తర్వాత ‘ప్రయాణం’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ‘ఊసరవెల్లి’, ‘మిస్టర్‌ రాస్కేల్‌’ వంటి సినిమాల్లో కూడా నటించిన ఆమె కన్నడలో ఒక సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళి ‘పటేల్‌కి పంజాబీ షాది’, ‘కోయి జానేనా’ సినిమాలు చేసింది. ఆ క్రమంలో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్టు ఆమె మాటల్లో తెలుస్తోంది. దీంతో బాలీవుడ్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఆ కారణంతోనే అవకాశాలు పోగొట్టుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళకు మరోసారి బాలీవుడ్‌లోని కమిట్‌మెంట్‌ గురించి మాట్లాడుతోంది. ‘దేవుడి దయవల్ల సౌత్‌ సినిమాల ద్వారా నటిగా పరిచయమయ్యాను. అదే బాలీవుడ్‌లో ఫస్ట్‌ ఎంట్రీ ఇచ్చి ఉంటే నా బట్టలు విప్పేసి నా పేరు మీద వ్యాపారం చేసుకునేవారు. వాళ్ళకు టాలెంట్‌తో పనిలేదు. బట్టలు విప్పేసి అందాలు చూపిస్తే చాలు’ అని ఘాటుగా విమర్శిస్తోంది. తాజాగా పాయల్‌ చేసిన ఈ ఆరోపణలు బాలీవుడ్‌ను బాగా డ్యామేజ్‌ చేసేవిగా ఉన్నాయి. కంగనా రనౌత్‌ బాలీవుడ్‌పై తరచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పాయల్‌కు ఈ విషయంలో కంగనా మద్దతు తెలిపింది. గతంలో పాయల్‌ చేసిన ఆరోపణలపై కంగనా తప్ప ఎవరూ స్పందించలేదు. మరి ఈసారి ఎలా స్పందిస్తారో చూడాలి. 



Source link

Related posts

ఉమెన్స్ డే కి మహేష్ బాబు సర్ ప్రైజ్..వైరల్ గా మారిన స్టోరీ 

Oknews

ప్రముఖ క్రికెటర్‌ను పెళ్లాడనున్న హీరో విశాల్ మాజీ ప్రేయసి..?

Oknews

మంచు విష్ణు కోసం రంగంలోకి దిగిన ప్రభుదేవా!

Oknews

Leave a Comment