Uncategorized

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్, రెండు కేసులు నమోదు-anakapalle police notice ex minister bandaru satyanarayana objection comments on minister roja ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


చివరికి అరెస్టు

గుంటూరు పోలీసులు నోటీసులతో బండారు సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు… ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బండారుకు బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉండడంతో… పోలీసులు బండారు ఇంట్లోనే వేచిచూసి, చివరకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. బండారు ఇంటికి చేరుకున్న టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు… పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు ఎక్కడపడితే అక్కడ 144 సెక్షన్‌ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణ భార్య పరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. అసెంబ్లీలో భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులు, మహిళా కమిషన్ ఏమైపోయిందని మండిపడ్డారు. మంత్రి రోజాకు రాజకీయ జీవితం ఇచ్చిందే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మరోవైపు బండారు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.



Source link

Related posts

CM Jagan Review : ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి – సీఎం జగన్ ఆదేశాలు

Oknews

డెలివరీ కోసం గర్భిణి 70 కి.మీ ప్రయాణం- ఆడబిడ్డకు ప్రసవం, ఇంతలోనే భర్త మరణవార్త!-palnadu woman went around govt hospitals for delivery husband died after going for money ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TTD Donations: టీటీడీ అన్నదానానికి ఒక రోజు విరాళం ఇవ్వడం ఎలా అంటే?

Oknews

Leave a Comment