తెలుగు,తమిళ,మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న.హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ని సంపాదించిన రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన సినిమా ల గురించే కాకుండా తన పర్సనల్ విషయాలని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన అభిమానులని ఉద్దేశించి రష్మిక చేసిన ఒక పోస్ట్ అలాగే తన లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 తో పాటు హిందీలో యానిమల్ అనే సినిమా అలాగే ఇంకొన్ని చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది .అలాగే వ్యాపార ప్రకటనల్లో కూడా తనదైన స్టయిలో చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.మొన్నీ మధ్య రష్మిక తన వర్క్ లో భాగంగా దుబాయ్ వెళ్లి అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొంది. మాములుగా అయితే అందరు పట్టించుకునే వాళ్ళు కాదు. అక్కడే రష్మిక కొత్తగా కనపడటం తో పాటు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయానికి వస్తే రష్మిక ఆ ప్రోగ్రాంలో అద్దాలు అంచులుగా కలిగిన చీరలో దర్శనం ఇచ్చి అక్కడున్న వాళ్ళని తన అందం గురించి మాట్లాడుకొనేలా చెయ్యడమే కాకుండా తన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అందంతో అభిమానుల మతుల్ని పోగొట్టింది.ఆ ఫోటోని చూసిన వాళ్ళందరూ రష్మిక అందానికి ఎవరు సాటి రారని అంటున్నారు.పైగా రష్మిక తన అభిమానుల మీద కూడా ఒక నింద వేసింది. ఆ ఫోటోకి క్యాప్షన్ గా నాకు చీరలంటే ఇష్టం కలిగేలా చేసింది మీరే అంటూ క్యాప్షన్ పెట్టింది.ఇంకో విషయం ఏంటంటే రష్మిక చేసిన ఆ పోస్ట్ కి 24 గంటలు దాటకుండానే 20 లక్షల లైక్స్ రావటం గమనార్హం.