మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని ముంబైలో కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 13 సంవత్సరాల క్రితం ఒక కమర్షియల్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసారు. మళ్ళీ ఇన్నాళ్ళకు కలుసుకున్నారు. ఈ ఫోటో బయటికి వచ్చిన మరుక్షణమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బెస్ట్ పిక్ ఆప్ ది డే’ అంటూ కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్ ఏమిటి.. అని అందరూ అనుకుంటున్నారు. 2009లో పెప్సీ యాడ్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. అప్పట్లో దానికి మంచి పేరు వచ్చింది. అయితే ఒక కమర్షియల్ యాడ్‌లో కలిసి నటించేందుకే మళ్ళీ కలిసారని తెలుస్తోంది. పెప్సీ యాడ్ బాగా సక్సెస్ అవ్వడంతో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి యాడ్ చేస్తే బాగుంటుందని అప్పట్లో అభిమానులు కోరుకున్నారు. అది ఇన్నాళ్ళకు జరుగుతోంది. వాస్తవానికి 2016లో నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ‘ఎం.ఎస్.ధోని’ బయోపిక్‌లో సురేష్ రైనా పాత్రను రామ్‌చరణ్ చేస్తారనే వార్త వినిపించింది. అది రూమర్ అని తర్వాత అర్థమైంది. అయితే మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక యాడ్ నటించడం అనేది ఇద్దరి అభిమానులు సంతోషించే విషయమే కదా.