EntertainmentLatest News

నాక్కూడా తెలీకుండా నా పెళ్ళి చేసేస్తున్నారు : మంగ్లీ


సినిమా ఇండస్ట్రీలోని హీరోలు, హీరోయిన్లు వారికి తెలియకుండానే పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. అదెలాగంటే.. ఈ సెలబ్రిటీలకు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేకపోయినా ఎవరో ఒకరితో వారికి లింక్‌ పెట్టేసి త్వరలో ఒక్కటవుతున్న జంట అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి న్యూస్‌లు ఎక్కువ వైరల్‌ అవుతుంటాయి. ఎందుకంటే సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ప్రభాస్‌, రామ్‌.. ఇంకా కొందరు హీరోలు, హీరోయిన్లు వయసు మీద పడుతున్నా వారికి పెళ్ళి మీద ధ్యాస ఉండడం లేదు. అయితే వారికి ఏదో విధంగా పెళ్ళి చేసేద్దాం అన్న ధోరణిలో నెటిజన్లు వారి పెళ్ళికి సంబంధించిన వార్తలను వైరల్‌ చేస్తున్నారు.

తాజాగా సింగర్‌ మంగ్లీ పెళ్ళి విషయం వార్తల్లోకి వచ్చింది. ఆమె పెళ్ళి చేసుకోబోతోందని, వరుడు వరసకు బావ అవుతాడనే న్యూస్‌ వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన మంగ్లీ.. ‘ఇప్పట్లో నాకు పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు. నేను చేసుకోబోయేవాడు వరసకు బావ అవుతాడని అంటున్నారు. అసలు నాకు తెలీని బావ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. భగవంతుడా.. నాక్కూడా తెలీకుండా నా పెళ్ళి చేసేస్తున్నారు’ అంటూ తన పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చింది. 



Source link

Related posts

మెగా షాక్.. రెండు భాగాలుగా ‘గేమ్ ఛేంజర్’.. మరింత ఆలస్యం!

Oknews

నాగ చైతన్య తండేల్ కోసం ఆయన్ని రంగంలోకి దింపి షూట్ కూడా చేసారు. 

Oknews

Ajith Kumar Health update అజిత్ కి జరిగింది బ్రెయిన్ సర్జరీ కాదు

Oknews

Leave a Comment