Top Stories

బాబు కేసుల‌పై మ‌రో రెండు రోజులు టెన్ష‌న్‌


రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో దాదాపు నెల నుంచి చంద్ర‌బాబునాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్‌లో బాబు అరెస్ట్‌, ఇంత కాలం జైల్లో వుండ‌డం అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు క‌ల‌గానే వుంది. బాబు రాక కోసం టీడీపీ, జ‌న‌సేన శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. బెయిల్‌పై బాబు ఇవాళో, రేపో వ‌స్తార‌ని ఆయ‌న అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ముఖ్యంగా బాబు పిటిష‌న్ల‌పై విచార‌ణ సాగుతున్న స‌మ‌యాల్లో ఎల్లో మీడియా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

అదిగో, ఇదిగో చంద్ర‌బాబు వ‌స్తున్నాడనే శీర్షిక‌ల‌తో టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహ‌ప‌రిచే ప్ర‌య‌త్నాన్ని గ‌మ‌నించొచ్చు. చివ‌రికి అవేవీ ఆచ‌ర‌ణ‌కు నోచుకోక‌పోవ‌డంతో టీడీపీ శ్రేణులు నిరాశ‌తో నిట్టూర్చాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో బాబు బెయిల్‌, క‌స్ట‌డీ పిటిష‌న్ల‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా విచార‌ణ జ‌రిగింది. ఇటు బాబు, అటు సీఐడీ త‌ర‌పు న్యాయ‌వాదులు హోరాహోరీగా వాద‌న‌లు వినిపించారు.

ఎట్ట‌కేల‌కు ఆ రెండు పిటిష‌న్ల‌పై వాద‌న‌లు ముగిశాయి. ఇక తీర్పు వెలువ‌డాల్సి వుంది. ఏ నేర‌మూ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు త‌ర‌పు న్యాయ‌వాది వాదించ‌గా, చేశాడ‌ని, ఇవిగో ఆధారాలంటూ సీఐడీ త‌ర‌పు న్యాయ‌వాది గ‌ట్టిగా వాదించారు. ఈ నేప‌థ్యంలో న్యాయ‌వాదులు ప‌ర‌స్ప‌రం ఆవేశాకావేశాల‌కు లోన‌య్యారు. ఇలాంటివ‌న్నీ న్యాయ‌స్థానాల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని చెబుతున్నారు. అయితే బాబుకు బెయిల్ వ‌స్తుందా? రాదా? అనే విష‌య‌మై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

బాబు శ్రేయోభిలాషులు బెయిల్ వ‌స్తుంద‌ని చెబుతూ, ఎలా సాధ్య‌మో చెప్ప‌డానికి పాజిటివ్ అంశాల్ని ప్ర‌స్తావిస్తున్నారు. మ‌రోవైపు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చంద్ర‌బాబుకు బెయిల్ రాదంటూ నేరం ఎంత తీవ్ర‌మైందో, అలాగే మాజీ ముఖ్య‌మంత్రికి అవినీతితో సంబంధం వుంద‌నే నిరూపించే సాక్ష్యాధారాలు బ‌లంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. దీంతో బెయిల్‌, అలాగే క‌స్ట‌డీల‌పై ఏసీబీ వెలువ‌రించే తీర్పుపై ఉత్కంఠ నెల‌కుంది. ఈ రెండు పిటిష‌న్ల‌పై సోమ‌వారం వ‌ర‌కూ ఎదురు చూడ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ఏసీబీ కోర్టు జ‌డ్జి తీర్పుని 9వ తేదీకి వాయిదా వేయ‌డ‌మే కార‌ణం. తీర్పు వెలువ‌డే రోజే, సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.



Source link

Related posts

ష‌ర్మిల‌ను చూస్తే ఆ ఎంపీకి జాలేస్తోంద‌ట‌!

Oknews

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. గ్రాండ్ రిసెప్షన్

Oknews

యాభై ఏళ్ల ప్రయాణం ఓ అదృష్టం

Oknews

Leave a Comment