Telangana

ఆదిలాబాద్ టు ప్రగతి భవన్… ఆర్మూరులో ‘ఆదివాసీల పాదయాత్ర’ భగ్నం-adilabad tribes arrested in padayatra at armor ,తెలంగాణ న్యూస్


ఆదివాసీలు తమ సమస్యలను పరిష్కరించాలని అనేకసార్లు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నత అధికారులకు విన్నవించారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్ నుంచి ప్రగతి భవన్ కు సుమారు 500మంది పాదయాత్ర యాత్రగా బయల్దేరారు. తాగునీరు, కరెంట్, విద్యా, వైద్య, రోడ్డుసౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో అదిలాబాద్ నుంచి ప్రగతిభవన్, రాజ్ భవన్ కార్యాలయాల వరకు పాదయాత్ర చేపట్టారు. సుమారు 130కిలోమీటర్లు సాగిన వీరి యాత్రలో అక్టోబరు 5వ తేదీన ఆర్మూర్ చేరుకుంది. అర్దరాత్రి 1గంటలకు పాదయాత్ర చేస్తున్నటువంటి తుడుం దెబ్బ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. వారు చేస్తున్న శాంతి యూత యాత్రను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేశారు.



Source link

Related posts

ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఆశచూపి రూ.66 లక్షలు స్వాహా-hyderabad cyber crime news in telugu old man cheated online trading with fake demat account ,తెలంగాణ న్యూస్

Oknews

కేటీఆర్ ఇలాకలో బీఆర్ఎస్ కు షాక్- కాంగ్రెస్ లో చేరిన జడ్పీటీసీ, 8 మంది సర్పంచ్ లు-sircilla news in telugu brs zptc 8 village sarpanch joined congress in presence minister ponnam prabhakar ,తెలంగాణ న్యూస్

Oknews

aicc released first list of congress mp candidates in telangana | Telangana MP Candidates: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్

Oknews

Leave a Comment