Sports

అనుకున్నది సాధించి.. చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ చేరిన పతకాలు.. తెలుగమ్మాయికి మూడో స్వర్ణం-india bags 100 medals in asian games for first time in history ,స్పోర్ట్స్ న్యూస్


Asian Games India: ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. నిర్దేశించుకున్న 100 పతకాల లక్ష్యాన్ని చేరుకొని సత్తాచాటింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో ఇండియా సత్తాచాటుతోంది. ఆసియా గేమ్స్ 14వ రోజైన నేడు (అక్టోబర్ 7) ఆరంభంలోనే భారత అథ్లెట్లు అదరగొట్టారు. మూడు స్వర్ణాలు సహా మొత్తం ఐదు పతకాలను కాసేపట్లోనే కైవసం చేసుకుంది ఇండియా. దీంతో 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 100కు చేరింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్ 100 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఇలా చైనా వేదికగా జరిగిన ఈ ఎడిషన్‍ ఆసియా క్రీడల్లో ఇండియా చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి సెంచరీ మార్కును చేరింది. అనుకున్నది సాధించింది. మరిన్ని పతకాల దిశగా కూడా భారత్ ముందుకు సాగుతోంది. కాగా, నేడు ఆర్చరీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఏకంగా మూడో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. భారత మహిళల కబడ్డీ జట్టు కూడా బంగారు పతకాన్ని పట్టింది. ఆ వివరాలు ఇవే.



Source link

Related posts

Aus vs Pak: పరుగుల హోరులో పాక్‌ ఓటమి, దాయాదికి వరుసగా రెండో పరాజయం

Oknews

Ravindra Jadeja CSK Thalapathy | Ravindra Jadeja CSK Thalapathy: ఫ్యాన్స్ ఇస్తే ఆ పేరు తీసుకుంటానన్న జడేజా

Oknews

CSK Openers Foreign Players | CSK Openers Foreign Players | IPL 2024 | సీఎస్కే కోసం విదేశీ ప్లేయర్లు ఇలా సెట్ అవటం మ్యాజిక్

Oknews

Leave a Comment