Top Stories

బాలీవుడ్ లో తిరుగులేని చరిత్ర


ఇప్పటికే జవాన్ సినిమాతో లెక్కలేనన్ని రికార్డులు సృష్టించాడు షారూక్. తనకున్న కింగ్ ఖాన్ హోదాను నిలబెట్టుకునేలా రికార్డులు తిరగరాశాడు. ఇప్పుడు వాటన్నింటినీ మించిన రికార్డ్ సృష్టించాడు. ఈసారి దీన్ని రికార్డ్ అనకూడదు, చరిత్ర అనాలేమో.

హిందీ చిత్రసీమ చరిత్రలోనే తొలిసారిగా 1100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రంగా జవాన్ నిలిచింది. తాజాగా వరల్డ్ వైడ్ ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్ ఇది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రానికి రాని వసూళ్లు ఇవి.

ప్రస్తుతానికి జవాన్ కలెక్షన్లు కాస్త మందగించినప్పటికీ.. రాబోయే రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ సినిమాను ఇంకా చైనాలో రిలీజ్ చేయలేదు. అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో కూడా జవాన్ హిట్టయితే, ఇక ఆ వసూళ్లను ఊహించుకోవడం కూడా కష్టమే అంటోంది ట్రేడ్.

హిందీ వెర్షన్ నే చూసుకుంటే.. దేశీయంగా 600 కోట్ల రూపాయల మార్క్ దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్ నిలిచింది. విడుదలైన 29వ రోజున కూడా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా కోటిన్నరకు పైగా వసూళ్లు రావడం విశేషం.

అయితే ఓవరాల్ గా చూసుకుంటే, జవాన్ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా వసూళ్లు ప్రస్తుతం 1100 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ.1215 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (రూ.1230 కోట్లు), బాహుబలి 2 (రూ.1780 కోట్లు), దంగల్ (రూ. 2400 కోట్లు) సినిమాలతో పోల్చి చూస్తే.. షారూక్ సినిమా ఇంకా వెనకబడే ఉంది. చైనాలో రిలీజై సక్సెస్ అయితే, కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ ను ఇది క్రాస్ చేసే అవకాశం ఉంది.

జవాన్ సక్సెస్ తో బాలీవుడ్ పూర్తిస్థాయిలో గాడిన పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పఠాన్, గదర్ 2తో పాటు ఓ మై గాడ్ 2, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ లాంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు జవాన్ తో బాలీవుడ్ పూర్వవైభవాన్ని పొందినట్టయింది.



Source link

Related posts

బాబుకు ప‌వ‌న్ కౌంట‌ర్‌.. రెండు స్థానాలు ప్ర‌క‌ట‌న‌!

Oknews

క‌ల‌యిక.. మూణ్ణాళ్ల ముచ్చ‌టేనా?

Oknews

టీడీపీ ఎమ్మెల్యే గుట్టు రట్టు చేసిన వైసీపీ

Oknews

Leave a Comment