Andhra Pradesh

మంత్రి రోజాకు మద్దతుగా నిలిచిన ఎంపీ నవనీత్ కౌర్, బండారు వ్యాఖ్యలపై ఆగ్రహం!-maharashtra mp navneet kaur fires on tdp leader bandaru satyanarayana objectionable comments on rk roja ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


MP Navneet Kaur : మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజాకు పలువులు ప్రుముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ … మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ… ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా మంత్రి రోజాకు అండగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండించిన ఆమె… ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఇంత దిగజారి మాట్లాడతారా? అని మండిపడ్డారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారని, కానీ బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయన్నారు. నీకు రాజకీయాలు కోసం, సిగ్గులేకుండా ఇంతలా మాట్లాడతారా? అని నవనీత్‌ కౌర్‌ ధ్వజమెత్తారు.



Source link

Related posts

AP Assembly Budget Session: పేదరిక నిర్మూలన ధ్యేయంగా నవరత్నాలను అమలు చేస్తున్నామన్న గవర్నర్ అబ్దుల్ నజీర్..

Oknews

AP PECET 2024: ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు..

Oknews

Tirumala : తిరుమలలో 'ఆణివార' ఆస్థానం – జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Oknews

Leave a Comment