Telangana

టీఎస్ఆర్టీసీ 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్, అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారం-hyderabad tsrtc 100 days grand festival challenge to employees in festival season ,తెలంగాణ న్యూస్


TSRTC : హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను అందజేశారు. మొత్తం 286 మందికి అవార్డులు వరించగా వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్ కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్ లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ ల‌తో పాటు సూప‌ర్‌వైజ‌ర్స్‌, డిపో మేనేజ‌ర్స్‌, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు సహా అన్ని విభాగాల వారు పుర‌స్కారాల‌ను అందుకున్నారు.



Source link

Related posts

Phone Tapping Case : ఇజ్రాయెల్ నుంచి పరికరాలు, రేవంత్ ఇంటిపై నిఘా..? ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తున్న కీలక విషయాలు

Oknews

సొంతంగా విమానాలు కొనేంత డబ్బు కవితకు ఎక్కడిది | Konda Surekha on Kavitha | Liquor Scam | ABP Desam

Oknews

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల దండారీ ఉత్సవాలు

Oknews

Leave a Comment