EntertainmentLatest News

ఇజ్రాయెల్‌ లో బాలీవుడ్ హీరోయిన్ మిస్సింగ్!


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన ఆమె, అక్కడే చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అక్కడ బాలీవుడ్ నటి మిస్ కావడం సంచలనంగా మారింది. ఆమె చివరిసారిగా నిన్న మధ్యాహ్నం తన బృందంలోని ఒకరితో మాట్లాడుతూ.. ఓ బేస్‌మెంట్‌లో దాక్కున్నట్లు తెలిపింది. అయితే అక్కడ యుద్ధం కొనసాగుతుండడంతో ఆమెతో బృందానికి కమ్యునికేషన్‌ సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమెను ఎక్కడో ఉందో తెలియడంలేదు.

2006 లో వచ్చిన జై సంతోషి మా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నుష్రత్ భరుచ్చా 25కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో కూడా మెరిసింది. తెలుగులో శివాజీ సరసన ‘తాజ్‌ మహాల్‌'(2010) అనే చిత్రంలో నటించిన ఆమె, తమిళంలో ‘వాలిబా రాజా’ అనే చిత్రంలో నటించింది.



Source link

Related posts

శివాత్మిక రాజశేఖర్ బ్యూటిఫుల్ శారీ లుక్

Oknews

అప్పుడు 'శక్తి'.. ఇప్పుడు 'కల్కి'..!

Oknews

Simbu To Romance Deepika Padukone శింబుతో జతకట్టనున్న క్రేజీ హీరోయిన్స్

Oknews

Leave a Comment