సెప్టెంబర్ 9న అరెస్ట్
నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చింది. కోర్టు చంద్రబాబు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఈ రిమాండ్ పొడిగించారు. దీంతో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబర్ 19 వరకు చంద్రబాబు జైలులోనే ఉండనున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ శ్రేణులు రోజుకో వినూత్న నిరసనతో ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకుంటుంది. చంద్రబాబు అరెస్టును దేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు ఖండిస్తున్నారు. అయితే కోర్టుల్లో మాత్రం చంద్రబాబుకు ఉపశమనం దొరకడంలేదు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖాలు చేసిన చంద్రబాబు లాయర్లు.. బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తనపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలని చంద్రబాబు ఏసీబీ, హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డారు. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఏసీబీ, హైకోర్టుల్లో చంద్రబాబు కేసుల్లో కీలక తీర్పులు వెలువడనున్నాయి.