Telangana

జహీరాబాద్ లో బీఆర్ఎస్ కు షాక్, బీజేపీలో చేరిన ఢిల్లీ వసంత్-zaheerabad delhi vasanth resigned to brs joins bjp ,తెలంగాణ న్యూస్


Delhi Vasanth : జహీరాబాద్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజే, జహీరాబాద్ కి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త ఢిల్లీ వసంత్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు ఢిల్లీ వసంత్. సుమారుగా వంద వాహనాల్లో జహీరాబాద్ నుంచి, హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయానికి ఢిల్లీ వసంత్ తన అనుచరులతో తరలి వెళ్లాడు. సరిగ్గా మూడు నెలల క్రితమే వసంత్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు పైన మరోసారి నమ్మకం ఉంచడంతో, ఆయన తీవ్ర నిరుత్సహానికి గురయ్యారు. బీజేపీకి కూడా జహీరాబాద్ లో బలమైన నాయకుడు లేకపోవడంతో, పార్టీ టికెట్ తనకే ఇస్తామని హామీ ఇవ్వటంతో, వసంత్ బీజేపీలో చేరారని తెలుస్తోంది.



Source link

Related posts

Telangana EdCET 2024 : బీఈడీ ప్రవేశాలు – తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల, మేలో ఎగ్జామ్

Oknews

Gold Silver Prices Today 01 February 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: అమాంతం పెరిగిన పసిడి

Oknews

Medaram police App: మేడారం జాతర సౌకర్యాలపై పోలీస్ శాఖ మొబైల్ యాప్.. అందుబాటులో పూర్తి సమాచారం…

Oknews

Leave a Comment