Top Stories

ర‌ఘురామ త‌ప్ప‌.. సీఐడీపై ఫిర్యాదులేవీ?


ఇటీవ‌ల కాలంలో ఏపీ సీఐడీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. రామోజీరావు మార్గ‌ద‌ర్శి ఆర్థిక అక్ర‌మాల కేసులు, రామోజీరావు, ఆయ‌న కోడ‌లు శైల‌జా కిర‌ణ్ విచార‌ణ‌, తాజాగా స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు అరెస్ట్‌, తాజాగా నారా లోకేశ్ విచార‌ణ త‌దిత‌ర ఎపిసోడ్స్‌లో సీఐడీ కేంద్రంగానే చ‌ర్చంతా న‌డుస్తోంది.

సీఐడీ అంటే వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఒక్క‌రే భ‌య‌పెట్టేలా చెప్పారు. సీఐడీ కేసు, విచార‌ణ అంటే రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు హ‌డ‌లిపోయేలా చేయ‌డంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు స‌క్సెస్ అయ్యారు. ర‌ఘురామ ఎంత‌గా భ‌య‌పెట్టారంటే… చివ‌రికి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబు వుంటే, ఆయ‌న త‌న‌యుడు ఏపీని విడిచి వెళ్లి ఢిల్లీలో తిష్ట వేసేంత‌గా అని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏదో ఒక కేసులో లోకేశ్‌ను ఇరికించి అరెస్ట్ చేస్తార‌ని కొంత కాలంగా విస్తృత‌మైన ప్ర‌చారం సాగుతోంది. ఈ క్ర‌మంలో లోకేశ్‌పై అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్‌కు సంబంధించి అలైన్‌మెంట్‌ను హెరిటేజ్ సంస్థ‌కు లాభం క‌లిగేలా మార్చార‌ని ద‌ర్యాప్తు సంస్థ సిట్ ఆధారాల‌తో స‌హా ఏసీబీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ క్ర‌మంలో ఏపీ అంటే సీఐడీనే లోకేశ్‌కు గుర్తుకొచ్చి, భ‌యంతో దేశ రాజ‌ధానిలో నిలిచిపోయార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రీ ముఖ్యంగా సీఐడీ పేరు చెప్పి లోకేశ్‌ను ర‌ఘురామ అభిమానంతో భ‌య‌పెట్టార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. గ‌తంలో సీఐడీ అధికారులు త‌న‌కు చేదు అనుభ‌వాల మిగిల్చిన ఎపిసోడ్‌కు సంబంధించి లోకేశ్‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ర‌ఘురామ వివ‌రించి, ఇక నీ ఇష్టం అని శ్రేయోభిలాషిగా భ‌య‌పెట్టిన‌ట్టు టీడీపీ నేత‌లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. దీంతో విచార‌ణలో త‌న‌పై సీఐడీ అధికారులు చేయి చేసుకుంటార‌ని లోకేశ్ భ‌య‌ప‌డ్డార‌ని ఆయ‌న్ను క‌లిసి పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

అయితే ఇటీవ‌ల కాలంలో వివిధ కేసుల్లో సీఐడీ విచార‌ణ ఎదుర్కొన్న టీడీపీ నాయ‌కులు లోకేశ్‌కు వాస్త‌వాల‌ను వివ‌రించారు. ర‌ఘురామ భ‌య‌పెట్టిన‌ట్టు సీఐడీ అధికారులు చేయి చేసుకోవ‌డం లాంటివి వుండ‌వ‌ని క్లారిటీ ఇచ్చారు. న్యాయ‌వాది స‌మ‌క్షంలో మ‌ర్యాద‌గానే విచారిస్తార‌ని లోకేశ్‌కు ధైర్యం చెప్పిన‌ట్టు స‌మాచారం. 

ర‌ఘురామ‌ది ప్ర‌త్యేక ప‌రిస్థితి అని, అందులోనూ సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ కావ‌డంతో, ప్ర‌భుత్వానికి అభిమానం ఎక్కువై అలా చేసి వుండొచ్చేమో అని లోకేశ్‌కు వివ‌రించిన‌ట్టు తెలిసింది. కేసులు పెట్ట‌డం మిన‌హాయిస్తే, ర‌ఘురామ ఆరోపించిన‌ట్టుగా, విచార‌ణ‌లో త‌మ‌తో సీఐడీ దురుసుగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు ఏ ఒక్క నాయ‌కుడు చెప్ప‌లేదు.



Source link

Related posts

ప‌వ‌న్‌కు అపాయింట్‌మెంటా.. ఎందుక‌బ్బా?

Oknews

సలార్-2 మరింత ఆలస్యం కానుందా..?

Oknews

సోలో విడుదలకు రవితేజ పట్టు?

Oknews

Leave a Comment