Top Stories

ప‌వ‌న్‌కు అపాయింట్‌మెంటా.. ఎందుక‌బ్బా?


జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బీజేపీ పెద్ద‌లు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. టీడీపీతో ఏ ప‌రిస్థితిలో పొత్తు కుదుర్చుకున్నానో ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌కు చెబుతాన‌ని వారాహి యాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ రోజో, రేపో ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అవుతార‌నే ప్ర‌చారాన్ని జ‌న‌సేన ఊద‌ర‌గొట్టింది. తీరా చూస్తే… అస‌లు విష‌యం వేరే వుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మాట్లాడేందుకు బీజేపీ పెద్ద‌లెవ‌రూ ఆస‌క్తిగా లేన‌ట్టు తేలింది.

ఒక‌వైపు ఎన్డీఏలోనే తాను ఉన్నాన‌ని ప్ర‌క‌టిస్తూ, మ‌రోవైపు టీడీపీతో పొత్తు, తెలంగాణ‌లో 32 చోట్ల పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డాన్ని బీజేపీ సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలిసింది. రాజ‌కీయాలంటే ప‌వ‌న్‌కు పిల్ల చేష్ట‌ల్లా ఉన్నాయా? అని బీజేపీ అగ్ర‌నేత ఒక‌రు మండిప‌డుతున్నార‌ని స‌మాచారం.

త‌న‌కు తానుగా బీజేపీతో పొత్తు పెట్టుకుని, తీరా ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీతో జ‌త క‌ట్ట‌డం ఏంట‌ని బీజేపీ పెద్ద‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిసింది. అందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అపాయింట్‌మెంట్ అడుగుతున్నా .. ప‌వ‌న్‌తో మాట్లాడాల్సింది ఏమీ లేద‌నే అభిప్రా యానికి బీజేపీ వ‌చ్చిన‌ట్టు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఏపీలో త‌మ‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ బద్నాం చేసిన‌ట్టు ఢిల్లీ పెద్ద‌లు ఆవేద‌న చెందుతున్నారు. బీజేపీని దెబ్బ తీయ‌డానికే ఎన్నిక‌లు అయిన త‌ర్వాత ప‌వ‌న్ పొత్తు పెట్టుకున్నాడ‌ని ఆ పార్టీ పెద్ద‌లు అనుమానిస్తున్నారు.

త‌మ‌తో పొత్తులో వుంటే వైసీపీ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌దనే ముందు జాగ్ర‌త్తగా ప‌వ‌న్ పావులు క‌దిపిన‌ట్టు బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఒక‌వైపు రానున్న ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తామ‌ని ప‌దేప‌దే ప‌వన్‌కు చెప్పిన‌ప్ప‌టికీ, ఏ మాత్రం స‌మాచారం ఇవ్వ‌కుండా టీడీపీతో జ‌త క‌ట్ట‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు బీజేపీ నేత‌లు అంటున్నారు. అందుకే ప‌వ‌న్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా బీజేపీ పెద్ద‌లు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేద‌నే సంగ‌తిని వారు చెబుతున్నారు. 



Source link

Related posts

ప‌వ‌న్‌తో వైసీపీ ఎమ్మెల్యే భేటీ!

Oknews

పోస్టర్ వచ్చింది.. డేట్ మాత్రం రాలేదు

Oknews

డ్రగ్స్ కేసు.. నవదీప్ కు నోటీసులు

Oknews

Leave a Comment