Latest NewsTelangana

TS ICET 2023 Special Phase Counselling Schedule Released, Check Dates Here


తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి ‘ప్రత్యేక విడత’ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉన్నత విద్యామండలి అక్టోబరు 11న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబ‌ర్ 15 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 

అభ్యర్థులు అక్టోబ‌ర్ 15న ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. అక్టోబ‌ర్ 16న ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబ‌ర్ 16 నుంచి 17 వ‌ర‌కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అక్టోబ‌ర్ 17 వెబ్ ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవాలి. వెబ్‌ఆప్షనలు నమోదుచేసుకున్నవారికి అక్టోబ‌ర్ 20న సీట్లను కేటాయిస్తారు.

సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబ‌ర్ 20 నుంచి 29 వ‌ర‌కు నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలలో ‘సెల్ఫ్ రిపోర్టింగ్’ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్టోబ‌ర్ 30 నుంచి 31 వ‌ర‌కు అభ్యర్థులకు కేటాయించిన కళాశాలలో నేరుగా రిపోర్టింగ్‌ చేయాలి. అక్కడ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.  ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ సీట్ల కోసం అక్టోబ‌ర్ 30న స్పాట్ అడ్మిష‌న్ల మార్గద‌ర్శకాలు విడుదల చేయనున్నారు. ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచినవారు ఐసెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 

ఐసెట్ ‘ప్రత్యేక’ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: అక్టోబ‌ర్ 15.

➥ సర్టిఫికెట్ వెరిఫికేషన్: అక్టోబ‌ర్ 16.

➥ వెబ్ ఆప్షన్ల నమోదు:  అక్టోబ‌ర్ 16, 17 తేదీల్లో

➥ వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్:  అక్టోబ‌ర్ 17.

➥ సీట్ల కేటాయింపు: అక్టోబ‌ర్ 20.

➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబ‌ర్ 20 నుంచి 29 వరకు.

➥ కళాశాలలో రిపోర్టింగ్: అక్టోబ‌ర్ 30, 31 తేదీల్లో.

➥ స్పాట్ అడ్మిష‌న్ల మార్గద‌ర్శకాలు: అక్టోబ‌ర్ 30న. 

Counselling Notification

Website

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన ‘టీఎస్ ఐసెట్‌-2023’ పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబరు 6న ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా..  సెప్టెంబ‌రు 15న‌ సీట్లను కేటాయించారు. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీకాగా, ఎంసీఏలో అన్ని సీట్లు నిండాయి. ఎంబీఏలో 24,029 సీట్లకు 20,985, ఎంసీఏలో 3,009 సీట్లకు అన్నీ భర్తీ అయ్యాయి. వాటిల్లో 902 మంది ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు పొందారు. మొత్తం 255 కళాశాలల్లో 80 చోట్ల అన్నీ సీట్లు నిండాయి.

ఇక రెండో విడత సీట్ల కేటాయింపులో  ఎంబీఏ కోర్సులో మొత్తం 21,983 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 2865 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లు వంద శాతం భర్తీకాగా ఎంబీఏ సీట్లు మాత్రం 2295 సీట్లు మిగిలాయి. 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండాయి. అందులో 15 యూనివర్సిటీలు ఉండగా, 68 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 254 ఎంబీఏ కాలేజీల్లోని 24278 సీట్లల్లో 21983 సీట్లు భర్తీ అయ్యాయి. 48 ఎంసీఏ కాలేజీల్లోని 2865 సీట్లల్లో వంద శాతం నిండాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

Gold Silver Prices Today 08 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: చుక్కలతో పోటీ పడుతున్న పసిడి

Oknews

ఈ హీరోయిన్ ల జోలికి వెళ్తే మటాషే.. గ్రహ స్థితి చాలా దారుణంగా ఉంది

Oknews

విడుదలకు ముందు ‘కల్కి’ టీం సంచలన నిర్ణయం.. షాక్ లో ఫ్యాన్స్..!

Oknews

Leave a Comment