EntertainmentLatest News

జాతీయ సినిమా దినోత్సవం.. మూవీ లవర్స్‌కి బంపర్‌ ఆఫర్‌!


అక్టోబర్‌ 13 జాతీయ సినిమా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇండియన్‌ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ సినిమా ప్రేమికుల కోసం ఒక బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. గత ఏడాది కూడా ఇదేరోజున భారీ ఆఫర్‌ ఇచ్చిన అసోసియేషన్‌.. ఈ సంవత్సరం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. రేపు అంటే శుక్రవారం ఒక్కరోజు టిక్కెట్‌ ధరను రూ. 99గా నిర్ణయించారు. 

దేశంలోని పీవీఆర్‌, సినీ పోలిస్‌, ఐనాక్స్‌, సిటీప్రైడ్‌, మిరాజ్‌, మూవీ టైమ్‌, ఏషియన్‌ వంటి మల్టీప్లెక్స్‌లు ఈ ఆఫర్‌ను మూవీ లవర్స్‌ కు అందించనున్నాయి. గత ఏడాది ఈ సినిమా పండుగలో తెలుగు రాష్ట్రాలు పాల్గొనలేదు. మరి ఈసారైనా ఈ సినిమా ఆఫర్‌ తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుందా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇతర ప్రాంతాల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు తెలిపాయి. దేశంలోని 4 వేలకు పైగా మల్టీప్లెక్స్‌లు ఈ పండగలో పాల్గొంటున్నాయి.



Source link

Related posts

Vijay fans slam DMK govt after Leo audio canceled విజయ్ లియో పై పొలిటికల్ కక్ష

Oknews

చిత్ర పరిశ్రమపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి! 

Oknews

Telangana Elections 2023: కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు, నెలాఖరు నుంచి పంపిణీ!

Oknews

Leave a Comment