posted on Oct 14, 2023 11:26AM
ప్రపంచంలో ఎక్కువమంది ప్రాణాలు తీసే జబ్బు గుండెపోటు. కరోనా తరువాత ఈ గుండె సంబంధ సమస్యలు మరింత పెరిగాయి. గుండె బలహీనం కావడం, తొందరగా అలసిపోవడం, ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలు చాలామందిలో ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు, చక్కని ఆహారపు అలవాట్లు కలిగినివారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అది కూడా సైలెంట్ అటాక్ లో చిక్కుకుంటున్నారు. గుండె ఆగిపోవడాన్ని వైద్య పరిభాషలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఇది గుండె శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు వచ్చే పరిస్థితి.
హార్ట్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా రావచ్చు. ఎందుకంటే అప్పటికి గుండె బలహీనమై ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. నేటికాలంలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని అన్ని సమయాలలో గమనించుకోవడం ఎంతో ముఖ్యం. రాత్రి నిద్రపోతున్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించి సమస్యలు కొన్ని వస్తుంటాయి. వీటి లక్షణాల గురించి తెలుసుకుంటే..
శ్వాస వేగంగా ఉండటం..
శ్వాస వేగంగా ఉండటం అనేది హార్డ్ ఫెయిల్యూర్ కు దారితీసే లక్షణం. దీన్ని రాత్రి నిద్రించే సమయాల్లో గమనించవచ్చు. దీనిని పార్క్సిస్మల్ నాక్టర్నల్ డిస్‌ప్నియా (PND) అంటారు. ఇది సాధారణంగా గాఢ నిద్రలోకి జారుకున్న కొన్ని గంటల తర్వాత జరుగుతుంది.ఈ సమస్య ఉన్న వ్యక్తి ఉబ్బరంతో మేల్కొంటాడు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూర్చోవడం లేదా నిలబడటం చాలా ముఖ్యం. నిద్రపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అనిపించినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. అది కార్డియాక్ అరెస్ట్‌కు సంకేతం .
గుండెదడ..
భయంగా ఉన్నప్పుడు గుండె దడగా ఉంటుంది. ఆ పీలింగ్ చాలామంది జీవితంలో ఒక్కసారి అయినా అనుభూతి చెంది ఉంటారు. అయితే గుండె ఆగిపోయేముందు వ్యక్తుల హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనిని టాచీకార్డియా అంటారు. ఇది ఒక నిమిషంలో గుండె 100 సార్లు కంటే ఎక్కువ కొట్టుకునే పరిస్థితి . ముఖ్యంగా నిద్రలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండకూడదు.
దగ్గు.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది..
హార్ట్ ఫెయిల్యూర్ ప్రాధమిక దశ శ్వాసలో గురక ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, బ్రోన్కియోల్స్ వాటిని దూరంగా ఉంచే ప్రయత్నంలో కుంచించుకుపోతాయి. దగ్గుతో పాటు గురక కూడా వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ సమస్య అనుభవంలోకి వస్తుంటుంది. ఈ పరిస్థితిని కార్డియాక్ ఆస్తమా అని పిలుస్తారు, దీనిలో ఒక వ్యక్తి నోటి నుండి నురుగు, గులాబీ రంగులో ఉండే కఫం కూడా బయటకు వస్తుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే , అది గుండె వైఫల్యం యొక్క లక్షణం. హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి, దిండు సహాయం తీసుకుని నిటారుగా కూర్చోవాలి. ఈ పరిస్థితిని ఆర్థోపెనియా అంటారు. ఇప్పటికే గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అకస్మాత్తుగా మెలకువ రావడం..
రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కొలపడం కూడా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా ఎదురవుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో చికిత్స ఆలస్యం మరణానికి కూడా దారితీస్తుంది.
ఎవరైనా సరే నిద్రిస్తున్నప్పుడు పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు ఎదుర్కొంటుంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.హార్ట్ ఫెయిల్యూర్ అనేది అత్యవసర సహాయం అవసరమయ్యే పరిస్థితి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఒక వ్యక్తి ప్రాణాలను నిలబెడుతుంది.
*నిశ్శబ్ద.