Telangana

నల్లగొండలో అసమ్మతికి బీఆర్ఎస్ చెక్, తిరుగుబాటు నేత రామరాజు యాదవ్ పై సస్పెన్షన్ వేటు-nalgonda brs suspended municipal councilor pilli ramaraju yadav ,తెలంగాణ న్యూస్


Nalgonda BRS : నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు ఏడాదికిపైగా కొన్నసాగిన ప్రచ్ఛన్న పోరుకు బీఆర్ఎస్ నాయకత్వం ముగింపు పలికింది. నల్లగొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై ఇన్నాళ్లకు పార్టీ ఓ నిర్ణయం తీసుకుంది. నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో విభేదించి బయటకు వెళ్లిన పిల్లి రామరాజు యాదవ్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ, పార్టీ నాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కంచర్ల భూపాల్ రెడ్డికే రెండో సారి కూడా టికెట్ ఇచ్చింది. అయినా పిల్లి రామరాజు యాదవ్ వెనక్కి తగ్గకుండా సీఎం కేసీఆర్ బొమ్మలు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి బొమ్మలు పెట్టుకుని, గులాబీ కుండవాలు కప్పుకునే నియోజకవర్గంలో పర్యటనలు చేశారు. దీంతో పిల్లి రామరాజు యాదవ్ కు చివరిలో బీఫారం ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇది అధికారిక అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ఏ కారణం చేతనో కానీ.. దాదాపు ఏడాది కాలంగా పిల్లి రామరాజు యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేసింది అధిష్టానం.



Source link

Related posts

Cyber Warrior: ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్‌ వారియర్… భద్రాద్రి జిల్లాలో పోలీసుల ప్రయోగం..

Oknews

Telangana State Public Service Commission has released TSPSC Group4 Results check here

Oknews

| Kavitha Case: కవిత కేసు మార్చి 13కి వాయిదా

Oknews

Leave a Comment