Top Stories

మెగా కాంపౌండ్ లో అటు మట్కా.. ఇటు గాంజా


ఉన్నఫలంగా మెగా హీరోలు రూటు మార్చినట్టు కనిపిస్తోంది. వాళ్లు సెలక్ట్ చేసుకుంటున్న కథలు డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఉదాహరణకు చిరంజీవినే తీసుకుంటే, చాన్నాళ్ల తర్వాత సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు చిరు. ఇప్పుడు మరో ఇద్దరు యంగ్ హీరోస్ కూడా డిఫరెంట్ చిత్రాలు చేస్తున్నారు.

ఈరోజు సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ హీరో చేయబోతున్న సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా గంజాయి చుట్టూ తిరుగుతుందనే విషయం టైటిల్ చూస్తేనే అర్థమౌతుంది. విడుదల చేసిన వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

తన కెరీర్ లో ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా చేయడం సాయితేజ్ కు ఇదే తొలిసారి. పైగా తెలంగాణ యాసలో కూడా మాట్లాడబోతున్నాయి. యాక్సిడెంట్ తర్వాత శారీరకంగా తనకు ఎదురైన ప్రతికూలతల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈ హీరో.. మాస్ రోల్ లో, తెలంగాణ యాసలో ఎలా రాణిస్తాడో చూడాలి.

అటు మరో హీరో వరుణ్ తేజ్ కూడా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల కిందట మట్కా అనే సినిమా స్టార్ట్ చేశాడు వరుణ్ తేజ్. 1958-1982 మధ్య జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తోంది. కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా అనే జూదం ఆధారంగా వస్తున్న ఈ సినిమా తన కెరీర్ లో ఓ చిన్న ప్రయోగమని వరుణ్ తేజ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అటు రామ్ చరణ్ కూడా తొలిసారి బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ట్రై చేస్తున్నాడు. ఇలా మెగా హీరోల్లో చాలామంది కొత్త కథలు ఎంచుకుంటూ, తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.



Source link

Related posts

గులాబీలకు కరెంటు షాక్!

Oknews

అసమ్మతి ముసుగులో కోవర్టులు!

Oknews

ఏపీలో కూడా కాంగ్రెసు టికెటుకు ఒక రేటు!

Oknews

Leave a Comment