YCP MP Vijaya Sai Reddy: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. చంద్రబాబు ఆరోగ్యంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దోమలు, మంచినీళ్లు, ఏసీలు అంటూ ఏదో ఒక డ్రామా చేస్తున్నారని…. అమిత్‌షా లోకేష్‌ను పిలిచినట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ అడ్వొకేట్‌ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పురంధేశ్వరిని ఎల్లో లోటస్‌గా అభివర్ణించిన విజయసాయిరెడ్డి …. రాజకీయ కక్ష సాధింపు అంటూ ఆమె తప్పుడు ప్చారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి సాక్ష్యాధారాలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిందన్నారు. గతంలో పురంధేశ్వరి భర్తే చంద్రబాబును అవినీతిపరుడన్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతిలో పురంధేశ్వరి వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.