EntertainmentLatest News

రేణు దేశాయ్‌కి మళ్లీ పెళ్లి.. అడ్డు పడుతున్న పవన్‌కళ్యాణ్‌ పిల్లలు!


‘బద్రి’ షూటింగ్‌ సమయంలో పవన్‌కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం, దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత 2009లో పెళ్ళి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మూడేళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి రెండో పెళ్ళి చేసుకోకుండా ఇద్దరు పిల్లలతో ఉంటోంది రేణు. ఆమధ్య తను మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. తన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను కూడా షేర్‌ చేసింది. రేణుదేశాయ్‌ మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందనే వార్త అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. తన రెండో పెళ్ళి ఆగిపోవడానికి కారణాలు ఏమిటి అనేది తర్వాత వివరించింది.

‘నాకు తగిన వ్యక్తి అనిపించిన వ్యక్తిని పెద్దల అంగీకారంతోనే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాను. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ చెప్పిందేమిటంటే…పిల్లలకి తోడుగా నువ్వు ఉండాలి. నువ్వు ఎలా ఉండగలవు అన్నారు. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోస్‌ కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత నేను చేసిన తప్పు తెలిసి వచ్చింది. నేను పెళ్ళి చేసుకుంటే అతనికి కొంత సమయం కేటాయించాలి. అప్పటికి నా కూతురు వయసు ఏడేళ్లు.  నా కూతురు కోసం ఆలోచించాను. ఇప్పటికే తండ్రి లేడు. నేను కూడా వేరే వ్యక్తితో ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఊహించలేం. అందుకే పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నాను. ఇప్పుడు తన వయసు 13 ఏళ్లు. నాకు పెళ్ళి అంటే మంచి అభిప్రాయం ఉంది. నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.  

ఆధ్య కాలేజ్‌కి వెళ్ళే టైమ్‌కి నా పెళ్ళి గురించి ఆలోచిస్తాను. నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే. ఒక వ్యక్తి వల్ల నువ్వు సుఖంగా, సంతోషంగా ఉంటావు అనుకుంటే హ్యాపీగా పెళ్లి చేసుకో మమ్మీ అని నా కొడుకు అకిరా నందన్‌ చాలా సార్లు అన్నాడు. అయితే నా ఇద్దరు పిల్లలకు టైమ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నా పెళ్ళి ఆలోచనని కొన్నాళ్ళు పోస్ట్‌పోన్‌ చేసుకున్నాను. మరో రెండు సంవత్సరాల్లో పిల్లలు పెద్దవారవుతారు. పెళ్ళి గురించి ఆలోచించడానికి అదే కరెక్ట్‌ టైమ్‌ అని నాకనిపిస్తోంది. 



Source link

Related posts

Mother reacts on the death of the Dangal actress దంగల్ నటి మృతి పై స్పందించిన తల్లి

Oknews

Bandla Ganesh sensational comments on Roja రోజా ఐటెం రాణి: బండ్ల గణేష్

Oknews

ఎప్పుడు పెట్టారో తెలియదు..చూస్తే వస్తు ఉంది

Oknews

Leave a Comment