Entertainment

ఆ నటుడు తో ఈ జన్మలో సినిమాలు చెయ్యను.. సంగీత దర్శకుడి నిర్ణయం 


 

డి. ఇమ్మాన్ తమిళనాడు లో మంచి పేరున్న సంగీత దర్శకుడు. 2002 వ సంవత్సరం లో విడుదలైన తమిజాన్ అనే సినిమా ద్వార తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసి  సుమారు వంద చిత్రాలకి పైన సంగీతాన్ని అందించాడు. దాదాపు తమిళంలో ఉన్న అందరి హీరో ల సినిమాలకి ఇమ్మాన్ సంగీతం అందించారు. మరి ముఖ్యం గా శివ కార్తికేయన్ సినిమాలకి ఆయన అందించిన సంగీతానికి మంచి పేరు వచ్చింది.అలాగే ఆ ఇద్దరి కాంబో లోని పాటలు తమిళనాడు మొత్తాన్ని ఒక ఊపు ఊపాయి. అలాగే ఇద్దరి మధ్య సినిమాల పరంగానే కాకుండా బయట కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. కాని ఏం జరిగిందో ఏమో గాని ఇమ్మాన్ శివ కార్తికేయన్ మీద సంచలన ఆరోపణలు చేసి సంచలన నిర్ణయాన్ని కూడా తీసుకోవడం తమిళనాడు చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది.

ఇమ్మాన్ అండ్ శివ కార్తికేయన్ కలయికలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ ఇద్దరి కాంబో లో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్. ముఖ్యంగా వరుత పథ వాలిబర్ సంగం మూవీ లోని ఉదక్ కలరు రిబ్బన్ అనే పాట అయితే నేటికి తమిళనాడులో ఏదో ఒక చోట మరుమోగిపోతునే ఉంటుంది. కాని ఇప్పుడు ఇమ్మాన్ ,శివ కార్తికేయన్ గురించి ఒక భారీ ప్రకటననే ఇచ్చాడు. నేను ఇక శివ కార్తికేయన్ సినిమాలకి సంగీతాన్ని అందించనని ఇప్పటి వరకు సంగీతాన్ని అందించి చాల తప్పు చేసానని అన్నాడు. అలాగే నెక్స్ట్ జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా సంగీత దర్సకుడ్ని అయితే  అప్పుడు శివ కార్తికేయన్ తో సినిమాలు చేస్తానేమో గాని ఈ జన్మలో ఇంక చెయ్యనని చెప్పుకొచ్చాడు. పైగా శివ కార్తికేయన్ నన్ను తీవ్రంగా మోసం చేసాడని ఆ మోసం గురించి లేట్ గా తెలుసుకొని అతన్ని అడిగితే అతను సమాధానం కూడా చెప్పలేదని శివ కార్తికేయన్ ని ఉద్దేశించి ఇమ్మాన్ చెప్పాడు.

శివ కార్తికేయన్ అండ్ ఇమ్మాన్ కలయికలో రజని మురుగన్ ,సీమరాజ,నమ్మ విదిత్ పిళ్ళై, తో పాటు  వరుత పథ వాలిబర్ సంగం సినిమా లు వచ్చాయి. సీమ రాజ ఆ ఇద్దరి కాంబో లో వచ్చిన చివరి మూవీ.

తమిళ సినిమా రంగంలో వివాద రహితుడిగా ఉండే శివ కార్తికేయన్ మీద ఇమ్మాన్ నిందలు వెయ్యడం తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది. తన మీద ఇమ్మాన్ చేసిన ఆరోపణల పై శివ కార్తికేయన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. శివ కార్తికేయన్ నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఆయనకి సినిమాలకి తెలుగు లో కూడా మంచి ఆదరణ ఉంది. ఇటివలే మహా వీరుడు సినిమా తో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులని అలరించాడు.అలాగే  తమిళం లో డబ్ అయ్యి తెలుగు లో రిలీజ్ అయిన రజని కాంత్ ,విజయ్ ,ఆర్య ,తదితర హీరోల సినిమాల ద్వారా ఇమ్మాన్ పాటలు తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమే.

 



Source link

Related posts

‘భీమా’ మూవీ రివ్యూ

Oknews

అల్లరి నరేష్‌ తో సితార మూవీ!

Oknews

ఎట్టకేలకు గద్దర్‌ అవార్డులపై స్పందించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ!

Oknews

Leave a Comment