Rahul Gandhi -Priyanka Gandhi Telangana Tour : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో… కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు యాత్ర లైవ్ అప్డేట్స్ కోసం పేజీని రీఫ్రెష్ చేయండి…
Wed, 18 Oct 202312:20 PM IST
కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్ , ప్రియాంక గాంధీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ములుగు జిల్లాలో రామప్ప ఆలయం నుంచి విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప నుంచి రామానుజపురం వరకు బస్సులో బయలుదేరారు కాంగ్రెస్ నేతలు. రామానుజపురంలో విజయభేరి సభలో రాహుల్, ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ వాహనం వెంట వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు.
Wed, 18 Oct 202312:10 PM IST
ములుగులో కాంగ్రెస్ విజయ భేరీ బస్సు యాత్ర ప్రారంభం
ములుగులో కాంగ్రెస్ విజయ భేరి బస్సు యాత్ర ప్రారంభం అయింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలో పాల్గొన్నారు.
Wed, 18 Oct 202311:51 AM IST
టార్గెట్ తెలంగాణ
ఈ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా… అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను చేపట్టారు. ఈ టూర్ లో భాగంగా.. అధికార బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేసే అవకాశం ఉంది.
Wed, 18 Oct 202311:47 AM IST
ప్రత్యేక పూజలు
రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు.
Wed, 18 Oct 202311:45 AM IST
స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
రామప్ప దేవాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి, ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, వంశీ చంద్ రెడ్డి గారు, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు.
Wed, 18 Oct 202311:43 AM IST
ఎల్లుండి బోధన్ కు రాహుల్..
ఎల్లుండి బోధన్ వెళ్లి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని సందర్శించి, కార్మికులతో మాట్లాడతారు రాహుల్ గాంధీ.
Wed, 18 Oct 202311:43 AM IST
రేపటి షెడ్యూల్ ఇదే
రేపు ఉదయం భూపాలపల్లి నుంచి మంథని వెళ్తారు రాహుల్ గాంధీ. అక్కడ నిర్వహించే పాదయాత్రలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పాల్గొంటారు. మంథని నుంచి పెద్దపల్లి వెళ్లి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 7గంటలకు కరీంనగర్‌లో చేపట్టే పాదయాత్రలో రాహుల్ పాల్గొని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
Wed, 18 Oct 202311:42 AM IST
కార్మికులతో రాహుల్ ముఖాముఖి
బీడీ కార్మికులు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినవారి కుటుంబాలు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులతో రాహుల్‌గాంధీ నేరుగా మాట్లాడేలా మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Wed, 18 Oct 202311:42 AM IST
రైతులతో రాహుల్ గాంధీ
ఈ పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీతో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, వ్యాపారులతో ముఖాముఖిలను ఏర్పాటు చేశారు. ఇందులో నేరుగా రైతులు, నిరుద్యోగులతో రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడనున్నారు.
Wed, 18 Oct 202311:41 AM IST
మూడు రోజులపాటు యాత్ర…
ఈ యాత్ర ములుగు, జయశంకర్-భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో మూడు రోజులపాటు కొనసాగనుంది. యాత్ర సందర్భంగా ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ పట్టణాల్లో బహిరంగ సభలను, భూపాలపల్లి, మంథని, కరీంనగర్, నిజామాబాద్‌లలో పాదయాత్రలను నిర్వహించనున్నారు.
Wed, 18 Oct 202311:40 AM IST
ములుగులో భారీ సభ
తొలుత ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ములుగు సమీపంలో నిర్వహిస్తున్న ఎన్నికల తొలి సభలో పాల్గొంటారు.
Wed, 18 Oct 202311:36 AM IST
రామప్పు నుంచి ములుగు వరకు
కాసేపట్లో కాంగ్రెస్ తలపెట్టిన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. రామప్పు నుంచి ములుగు వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.
Wed, 18 Oct 202311:36 AM IST
ప్రత్యేక పూజలు
రామప్పకు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Wed, 18 Oct 202311:34 AM IST
కాంగ్రెస్ బస్సు యాత్ర…
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో… కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం వద్ద బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వారిద్దరూ రామప్పుకు చేరుకున్నారు.