Entertainment

అది విని నా గుండె పగిలిపోయింది.. మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు!


ఏ విషయం గురించైనా స్పందించడం, తన అభిప్రాయం తెలియజేయడం మంచు లక్ష్మీకి మొదటి నుంచీ అలవాటే. అది రాజకీయమైనా, సినిమా అయినా స్పందన మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఓ కొత్త అంశంపై తన గుండె పగిపోయిందంటూ స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతలా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే… ఇటీవల స్వలింగ వివాహాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. సేమ్‌ సెక్స్‌ వివాహాలు విదేశాలలో చాలా సర్వసాధారణం. కానీ, మన దేశంలో అలాంటి స్వతంత్రం లేదు. దీని గురించి జరిగిన అనేక చర్చల తర్వాత సుప్రీమ్‌ ఓ సంచలన తీర్పును వెలువరించింది. స్వలింగ వివాహాలను ఆమోదించలేమని కోర్టు స్పష్టం చేసింది. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా దాన్ని పార్లమెంటుకే వదిలేస్తున్నామని, ఈ విషయంలో తుది నిర్ణయం వారిదేనని చెప్పింది. 

సుప్రీమ్‌ కోర్టు తీర్పును ఎంతో మంది ఖండిరచారు. కొందరు బాలీవుడ్‌ హీరోయిన్లు బాహాటంగానే తన నిరసనను వ్యక్తం చేశారు. ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఇవ్వాలని వారు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే… టాలీవుడ్‌ నుంచి మంచు లక్ష్మీ ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీమ్‌ కోర్టు తీర్పు విని తన గుండె పగిలిపోయిందని చెప్పింది. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించలేమని సుప్రీమ్‌ కోర్టు చెప్పడంతో తానెంతో నిరాశకు లోనయ్యానని అంటోంది. ప్రేమ అనే అనుభూతిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన భారతదేశానికి ఈ తీర్పు నిజంగా అవమానం అంటోంది. ఎన్నో దేశాల్లో స్వలింగ వివాహాలు చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు. మన దేశంలో కూడా ఈ వివాహాలను చట్టబద్దం చేయలేమా అని ప్రశ్నిస్తోంది మంచు లక్ష్మీ.



Source link

Related posts

భయంతో అల్లాడిపోతున్న అగ్రనటుడు!

Oknews

ఓటీటీలోకి ఆస్కార్ విజేత ‘ఓపెన్‌హైమర్’.. నోలన్ ఫ్యాన్స్ కి పండగే!

Oknews

ఆ హీరోయిన్ విషయంలో మాది పొరపాటే.. చీర రేటు కనిపెట్టలేకపోయాం

Oknews

Leave a Comment