హీరోలనైనా, హీరోయిన్లనైనా ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో, ఎంతగా ఆరాధిస్తారో… వారికి ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు వస్తే అంతే తల్లడిల్లిపోతారు. ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమలో విషాద వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఎవరికైనా ఆరోగ్య సమస్య రావచ్చు. ఇప్పుడు ఓ పాపులర్ హీరోయిన్ హాస్పిటల్‌లో బెడ్‌పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటో చూడగానే ఆందోళన చెందిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు ఏమైంది అనే ఎంక్వయిరీ చేస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సునయన ఆసుపత్రిలో చేరింది. సమస్య ఏమిటి అనేది ఇంతవరకు తెలీదుగానీ ఆమె ఫోటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైన సునయన ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఆదరణ బాగుండడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. సడన్‌గా సునయన తన ఇన్‌స్టాలో ఈ ఫోటోను పోస్ట్ చేసింది సెలైన్ ఎక్కుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటో పెట్టి ‘కొంచెం టైమ్ ఇవ్వండి.. మళ్ళీ హ్యాపీగా తిరిగొస్తాను’ అని కామెంట్ చేసింది. అసలు ఆమెకు ఏం జరిగింది అనే విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె త్వరగా కోరుకోవాలని, మళ్ళీ సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నట్టు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 2005లో కుమార్ వర్సెస్ కుమారి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునయన ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు పాతిక సినిమాలకుపైగా చేసింది. గత ఏడాది వచ్చిన ‘రాజరాజచోర’ చిత్రంలో కూడా నటించింది.