Telangana

మరణంలోనూ వీడని స్నేహం, ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి-sangareddy tractor accident three friends died ,తెలంగాణ న్యూస్


Sangareddy News : ఒకే గ్రామానికి చెందిన వారు ముగ్గురు స్నేహితులు మూడు ట్రాక్టర్లు కొనుక్కున్నారు, కలిసి ట్రాక్టర్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. కానీ అనుకోని ప్రమాదంలో ఆ ముగ్గురు స్నేహితులు ఒకేరోజు మరణించారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని కొలుకురు గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కొలుకురు గ్రామానికి చెందిన ఈటల రమణ (45), ఎంపల్లి మల్లేష్ (30), మంగలి గోపాల్ (30) ముగ్గురు తలా ఒక ట్రాక్టర్ కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈటల రమణకి చెందిన ట్రాక్టర్ ట్రాలీ టైర్ శనివారం రోజు పంక్చర్ అయింది. ఆ టైర్ ను గోపాల్ కు చెందినా ట్రాక్టర్ లో వేసుకొని సదాశివపేటలో పంక్చర్ వేయించడానికి ముగ్గురు కలిసి బయలుదేరారు. ఊరి చివర ఉన్న సింగూరు కాలువ మీదుగా సదాశివపేట పట్టణం వైపు వెళ్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి సింగూరు కాలువలో పడిపోయింది. అది పూర్తిగా బోల్తా పడటంతో ట్రాక్టర్ మీద ఉన్న ముగ్గురు కూడా ఇంజిన్ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.



Source link

Related posts

సైబర్ మోసం… రూ. 80 లక్షలు పోగొట్టుకున్న బాధితులు-80 lakhs lost in the net of cyber criminals in sangareddy district ,తెలంగాణ న్యూస్

Oknews

Revanth Reddy makes sensational comments on Kavitha in Narayanpet meeting | Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు

Oknews

Telangana Politicians Social Media Accounts Hacked Damodar Rajanarsimha Tamilisai Kavitha Complaint On Hacking

Oknews

Leave a Comment