Top Stories

ముగిసిన బాబు శ‌కం!


చంద్ర‌బాబుతో పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బాబు మాయ‌లో ప‌డొద్ద‌ని ప‌వ‌న్‌కు హిత‌వు చెప్పారు. అలాగే రాజ‌కీయంగా బాబు క‌థ ముగిసింద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా కాపుల ఓట్ల‌ను చంద్ర‌బాబుకు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.  

రాజ‌కీయంగా ఒక విధానం అంటూ లేకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం వైసీపీకి ఆయుధంగా మారింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాజ‌మండ్రిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పవ‌న్ త‌న పంథాపై ఆలోచించుకోవాల‌ని హిత‌వు చెప్పారు.

ఒక్కో ఎన్నిక‌కు ఒక్కో విధానాన్ని ప‌వ‌న్ అనుస‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో బీజేపీతో, ఏపీలో టీడీపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీన్నేమ‌ని పిలుస్తార‌ని ఆయ‌న నిల‌దీశారు. రాజ‌కీయాల్లో ప‌వ‌న్‌ను ఒక ప‌నిముట్టుగా వాడుకుంటున్నార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు ఎంత మేర‌కు ప్రాధాన్యం ఇస్తున్నారో ప‌వ‌న్ ఆలోచించుకోవాల‌ని మంత్రి కోరారు.

కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాన‌సిక క్షోభ‌కు గురి చేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌రోసారి కాపుల‌ను చంద్ర‌బాబు మోస‌గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు. కాపుల‌కు చంద్ర‌బాబు మోసాన్ని ప‌వ‌న్ గ్ర‌హించాల‌ని ఆయ‌న కోరారు.

దేశంలోని చ‌ట్టాలేవీ త‌న‌కు వ‌ర్తించ‌వ‌నే భ్ర‌మ‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు రాజ‌కీయ శ‌కం ముగిసింద‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఇప్పుడు బెయిల్ రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు క్షోభ‌కు గురి అవుతున్నార‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌నే కాదు.. ఇంకెంత మంది క‌లిసొచ్చినా త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేర‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్, జ‌నం మ‌ధ్య బంధాన్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.



Source link

Related posts

రెండు భాగాలు మాత్రమే కాదు, 2 ట్రయిలర్స్ కూడా?

Oknews

ఆ మాటలతో స్థాయి దిగజార్చుకున్న మోడీ!

Oknews

వైసీపీలోకి మాజీ మంత్రి!

Oknews

Leave a Comment