EntertainmentLatest News

రష్మిక ఎవరి గర్ల్ ఫ్రెండ్?


నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ అనౌన్స్ మెంట్ ఈరోజు వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారి ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను దర్శకుడు. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉన్నాయి. “నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా” అంటూ మోషన్ పోస్టర్ వాయిస్ ఓవర్ లో వచ్చిన డైలాగ్స్, రష్మిక శ్వాసను ఆపి నీటిలో కూర్చుని ఉండటం…మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.



Source link

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ

Oknews

కురంగు పెడల్ మూవీ రివ్యూ

Oknews

రామ్ చరణ్ సినిమాలో ఉత్తరాంధ్ర కళాకారులు నటిస్తారా 

Oknews

Leave a Comment