Latest NewsTelangana

TS CPGET 2023 Second Phase Counselling Seats Allotted, Check Here | TS CPGET 2023: సీపీగెట్ రెండోవిడత సీట్ల కేటాయింపు పూర్తి


కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ సీట్లను అధికారులు కేటాయించారు. ఈ కౌన్సెలింగ్‌లో 20,743 అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోగా.. 12,244 మంది అభ్యర్థులు సీట్లు దక్కించుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 28లోగా ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒరిజినల్‌ టీసీ, సర్టిఫికేట్లతో సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయాలి. మొదటి విడుతలో 14,119 మంది విద్యార్థులు రిపోర్ట్‌ చేయగా.. మొదటి రెండో విడుత కలుపుకుంటే మొత్తంగా 23,920 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. వీరిలో 17,327 మంది మహిళలు ఉండటం విశేషం. పురుషులు కేవలం 6,593 సీట్లను మాత్రమే దక్కించుకున్నారు.

సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..

‘కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్)-2023’ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబరు 12 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అక్టోబరు 13న సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏమైనా లోపాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అక్టోబరు 14 నుంచి 17 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అక్టోబరు 17న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించారు. అభ్యర్థులకు అక్టోబరు 23న సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు 26 నుంచి 31లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

సీపీగెట్-2023 పరీక్షలను జూన్‌ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఫలితాలు ఆగస్టు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 93.42 శాతం మంది అర్హత సాధించారు. అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు.

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు..

➥ రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.

➥ డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.

➥ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...



Source link

Related posts

gold shop robbery in | బైక్ పై వచ్చి కత్తులతో దాడి

Oknews

AP Telangana Weather News 4th April Heat Waves In AP And Telangana

Oknews

Telangana: తెలంగాణలో ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతోంది: అసోం సీఏం సంచలన వ్యాఖ్యలు

Oknews

Leave a Comment