Andhra Pradesh

నిఖార్సైన రాజకీయ నేత- 1000 మందికి కోడి, క్వార్టర్ మందు పంపిణీ!-visakhapatnam ysrcp leader distributes chicken liquor bottle to 1000 people on dussehra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Visakhapatnam News : తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు. పండుగ నాడు కోడి కూర, కిక్కిచ్చే చుక్క ఉంటే కొందరికి పండుగే. దసరా పండుగ నాడు యజమానులు తమ వద్ద పనిచేసే వాళ్లకు బోనస్ లు ఇస్తుంటారు. ఇక రాజకీయ నేతలైతే తమ మద్దతుదారులకు మందు, ముక్క తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఘటననే విశాఖలో చోటుచేసుకుంది. దసరా పండుగ నాడు విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్‌ తమ మద్దతుదారులు, మరికొంత మందికి కోడి, లిక్కర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విశాఖ డాబా గార్డెన్స్‌లోని వైసీపీ ఆఫీసు వద్ద మంగళవారం నాడు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నేత కోడి, మద్యం పంపిణీ చేశారు. గతంలో కేజీ మటన్‌ ఇచ్చామని, ఈ ఏడాది కోడి, క్వార్టర్‌ మందు ఇస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్పుకున్నారు. మద్యపాన నిషేధం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మద్యం బాటిల్స్ పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.



Source link

Related posts

AP TET 2024 Updates : ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం – ఈ లింక్ తో ప్రాసెస్ చేసుకోండి

Oknews

CM Jagan Ongole Tour: నేడు ఒంగోలుకు సిఎం జగన్.. వారికి మాత్రం నో ఎంట్రీ… తేల్చేసిన అధికారులు

Oknews

మంత్రి గారి భార్యకు కోపమొచ్చింది, కాన్వాయ్ కావాలంటూ పోలీసులపై చిందులు!-rayachoti minister ramprasad reddy wife fires on police for convey to escort video viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment