సిలబస్ లో మార్పులతో పేద విద్యార్థుల కోసం ఇతర వినూత్న కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన ‘డిజిటల్ టీచర్’ సహాయంతో ప్రభుత్వ బడుల్లో జర్మన్, స్పానిష్ భాషలు నేర్పించే విషయమై స్పానిష్, జెర్మనీ ఎంబసీ ఉన్నతాధికారులు ఎలీనా పెరేజ్, మేనిక్ యూజినా, మతియాస్ స్థాలే లతో చర్చించామన్నారు.