Top Stories

అబ‌ద్ధాల్ని గెలిపిస్తున్న భువ‌న‌మ్మ‌


నిజం గెల‌వాలి పేరుతో జ‌నంలోకి వెళ్లిన చంద్ర‌బాబు సతీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. భువ‌నేశ్వ‌రి ప్ర‌సంగాల్లో స్వ‌యం స్తుతి, ప‌ర‌నింద త‌ప్ప‌, నిజాలు మ‌చ్చుకైనా లేవ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న భ‌ర్త చంద్ర‌బాబు, కుమారుడు లోకేశ్‌లా ప‌చ్చి అబద్ధాలు చెప్ప‌డానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అంటున్నారు. 

నారా కుటుంబానికి, నిజాల‌కు పూర్తిగా విరోధ‌మ‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. త‌న కుటుంబ గోడు త‌ప్ప‌, జ‌నం ఆవేద‌న‌ను ఆమె ప‌ట్టించుకుంటున్న పాపాన పోలేదు. చంద్ర‌బాబు త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్‌ను 48 రోజులుగా చూడ‌లేద‌ని భువ‌నేశ్వ‌రి వాపోయారు. అలాగే చంద్ర‌బాబు జైల్లో ఉన్న విష‌యాన్ని మ‌న‌వ‌డికి చెప్ప‌లేద‌ని అన్నారు. ఇలా ఎంత సేపూ త‌న కుటుంబ స‌మ‌స్య‌ల్నే భువ‌నేశ్వ‌రి ప్ర‌జ‌ల ముందు వినిపిస్తున్నారు.

దీంతో జ‌నానికి కూడా విసుగు పుట్టిస్తోంది. భువ‌నేశ్వ‌రి ఆవేద‌న ఎలా వుందంటే…చంద్ర‌బాబు అరెస్ట్‌తో త‌న కుటుంబం క‌ష్టాల్లో వుంద‌ని, అండ‌గా నిల‌వాల‌ని వేడుకుంటున్న‌ట్టుగా వుంది. క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుండ‌డానికి వ‌చ్చామంటే నాయ‌కుల‌పై గౌర‌వం, న‌మ్మ‌కం క‌లుగుతాయి. అలా కాకుండా మీరంతా మాకు వెన్నుద‌న్నుగా వుండాల‌ని కోరితే …ఇదేం నాయ‌క‌త్వం అని జ‌నం పెద‌వి విరుస్తున్నారు. ఇందులో నిజం గెల‌వ‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్టీఆర్‌లోని పౌరుషం, చంద్ర‌బాబులోని క్ర‌మ‌శిక్ష‌ణ మ‌న పోరాట ఆయుధాల‌ని ఆమె భారీ డైలాగ్‌లు కొట్టారు. నిజంగా ఎన్టీఆర్‌లోని పౌరుషం వాళ్ల పిల్ల‌ల్లో వుంటే, ఇవాళ చంద్ర‌బాబు చేతికి టీడీపీ పోయి వుండేదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఎన్టీఆర్‌లోని పౌరుషం వుంటే…ఆయ‌న్ను న‌డిరోడ్డుపై అవ‌మానిస్తే ర‌క్తం పంచుకు పుట్టిన బిడ్డ‌లుగా చంద్ర‌బాబుపై ఆనాడే తిరుగుబాటు చేసి వుండేవార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

ఎన్టీఆర్ బిడ్డ‌లుగా ఆయ‌న‌లోని పౌరుషాన్ని ఏ ఒక్క‌రూ పుణికి పుచ్చుకోలేక‌పోయారు. చంద్ర‌బాబు స‌తీమ‌ణిగా భ‌ర్త‌లోని న‌ట‌న‌, వంచ‌న‌, అబ‌ద్ధాల్ని మాత్రం భువ‌నేశ్వ‌రి బాగా అల‌వ‌ర‌చుకున్న‌ట్టే క‌నిపిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. చంద్ర‌బాబును అరెస్ట్‌కు, స్వాతంత్య్ర పోరాటానికి ఏంటి సంబంధం అనే ప్ర‌శ్న ఎదురైంది. చంద్ర‌బాబు నుంచి భువ‌నేశ్వ‌రి నేర్చుకున్న‌ది ఇలాంటి అతిశ‌యోక్తి, విప‌రీత ధోర‌ణి అని దెప్పి పొడుస్తున్నారు. 

నిజం గెల‌వాల్సింది న్యాయ‌స్థానాల్లో అని, వీధుల్లోకి వ‌చ్చి అల్ల‌రి చేస్తే ప్ర‌యోజ‌నం ఏంట‌నే ప్ర‌శ్న త‌లెత్తింది. బాబును జైలు నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు సుప్రీంకోర్టు లాయ‌ర్ల‌కు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా ఊర‌ట ద‌క్క‌లేద‌ని, ఆ విష‌యం భువ‌నేశ్వ‌రికి తెలియ‌దా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. నిజం గెల‌వాలంటే ప్ర‌త్య‌ర్థుల‌పై రాజ‌కీయ విమర్శ‌లు చేస్తే స‌రిపోద‌ని, అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని నిరూపించుకోవాల‌ని భువ‌నేశ్వ‌రికి జ‌నం హిత‌వు చెబుతున్నారు. 

ఇంత‌కాలం చంద్ర‌బాబు, లోకేశ్ అబ‌ద్ధాల్నే విన్నామ‌ని, ఇప్పుడు వారికి భువ‌నేశ్వ‌రి తోడ‌య్యార‌ని సెటైర్స్ విసురుతున్నారు.



Source link

Related posts

ఏంటి బ్రో ఇది.. అరకొరగా మెరిసిన పవన్ సినిమా

Oknews

జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కే పెద్ద‌పీట‌

Oknews

హిందూత్వ ఎజెండా మాదిరిగానే ట్రంప్ నడుస్తున్నాడా?

Oknews

Leave a Comment