Top Stories

వైసీపీని పొగుడుతున్న జేడీ..!


వైసీపీని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగుడుతున్నారు. ఏపీలో విద్యా వైద్య రంగాలలో గణనీయమైన మార్పులు వైసీపీ ప్రభుత్వం హయాంలో వచ్చాయని ఆయన అంటున్నారు. ఇందులో నిజాలు ఉన్నాయి. అయినా జేడీ వైసీపీ మనిషి కాదు, ఆయన నోట ఈ మాటలు వినడం అంటే ఆశ్చర్యమే అనుకోవాలి.

జేడీ నిర్మాణాత్మకంగానే విమర్శలు చేస్తారు అని కూడా ఉంది. ఏపీలో పాలనా వికేంద్రీకరణ విషయంలో తనదైన సలహా సూచనలు అప్పట్లో జేడీ చేశారు. అభివృద్ధి పరిపాలన అన్ని వైపులా విస్తరించాలని ఆయన కోరుకుంటూ వస్తున్నారు. జేడీ అయితే రాజకీయ నేత కంటే ముందు మేధావి వర్గానికి చెందిన వారు. అందువల్ల ఆయన ప్రభుత్వ పనితీరుని మెచ్చుకుంటే ప్రజోపయోగమే ఉంటుందని భావించవచ్చు.

అయితే ఇపుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. జేడీ వైసీపీ సర్కార్ ని మెచ్చుకున్నది కూడా వైసీపీ కార్యక్రమంలో దాంతో జేడీ పొగడ్తల వెనకాల ఏమి ఉండి ఉంటుంది అని అంతా ఆలోచిస్తున్నారు. జేడీ విశాఖ నుంచి ఎంపీగా ఈసారి పోటీ చేసి తీరుతాను అని ఇప్పటికి అనేకసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు.

అందువల్ల జేడీ విశాఖ నుంచి పోటీ ఖాయం. ఆయన వస్తానంటే స్వాగతం చెప్పే పార్టీలు చాలా ఉన్నాయి. జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ వాటిలో ఉన్నాయి. జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడితే అక్కడ ఎంపీ అభ్యర్ధుల జాబితా పెరిగిపోతుంది, జేడీకి అవకాశం ఎంతవరకూ ఉంటుందో తెలియదు.

వైసీపీ నుంచి అయితే మెండుగానే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వైసీపీ బలమైన సామాజికవర్గం నుంచి అభ్యర్ధిని దించాలని చూస్తోంది. అలా జేడీకి ప్రయారిటీ ఉండవచ్చు. వైసీపీ వారు కూడా జేడీని పార్టీలో చేరమని కోరినట్లుగా ప్రచారంలో ఉంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. జేడీ పొగడ్తల వెనక చిత్తశుద్ధిని శంకించలేరు, అలాగే రాజకీయ ఆలోచనలను కూడా కొట్టిపారేయలేరు అని అంటున్నారు. ఏమి జరుగుతుంది అన్నది కొద్ది కాలంలో తెలుస్తుంది అంటున్నారు.



Source link

Related posts

మేనిఫెస్టో వంటకంలో ఏదైనా కలిపేద్దాం!

Oknews

ఆత్మహత్యలకు కేటీఆర్ హింట్ ఇస్తున్నారా?

Oknews

ఆ మాటలతో స్థాయి దిగజార్చుకున్న మోడీ!

Oknews

Leave a Comment