Top Stories

ఏంటి బ్రో ఇది.. అరకొరగా మెరిసిన పవన్ సినిమా


బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు రికార్డ్ స్థాయిలో 29.4 రేటింగ్ వచ్చింది. ఇక మహేష్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఏకంగా 23.4 టీఆర్పీ వచ్చింది. మరి, అల్లు అర్జున్, మహేష్ కు ఏమాత్రం తీసిపోని పవన్ కల్యాణ్ సినిమాకు ఏ స్థాయిలో రేటింగ్ రావాలి. ఇలా కంపేర్ చేసి చూస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిందే.

పవన్ తాజా చిత్రం బ్రో.. బుల్లితెరపైకొచ్చింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమాకు జస్ట్ 7.24 రేటింగ్ మాత్రమే వచ్చింది. పైన చెప్పుకున్న 2 సినిమాలతో పోల్చి చూస్తే, ఇది చాలా అంటే చాలా తక్కువ. పైగా ఇద్దరు హీరోలు నటించిన సినిమా ఇది.

థియేటర్లలో యావరేజ్ గా ఆడింది బ్రో సినిమా. కాబట్టి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పోల్చడం సరికాదు అనే వాదన చేయొచ్చు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు 7.7 వచ్చింది. ఫ్లాప్ సినిమా రాధేశ్యామ్ కు 8 వచ్చింది.

అంతెందుకు, పవన్ కల్యాణ్ గత చిత్రం భీమ్లా నాయక్ కు 9 టీఆర్పీ వచ్చింది. సో.. వీటితో పోల్చి చూసుకున్నా బ్రో సినిమాకు వచ్చింది తక్కువే అని చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్ కు బుల్లితెర వీక్షకుల్లో క్రేజ్ తగ్గిందా లేక సినిమాను ప్రసారం చేసిన ఛానెల్ కు రీచ్ తగ్గిందా అనేది ఇప్పట్లో చెప్పలేం.

ఇదే టైమ్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మహావీరుడు సినిమా కూడా టీవీల్లో టెలికాస్ట్ అయింది. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమాకు, బుల్లితెరపై కూడా అదే స్థాయిలో రేటింగ్ వచ్చింది.



Source link

Related posts

రిటైర్డ్ వెటరన్‌లని చేరదీసి ఏం చేయాలని?

Oknews

ఒకే పార్టీ.. ఒకే కులం.. సోషల్ వార్!

Oknews

రిటర్న్ గిఫ్ట్ దేవుడెరుగు.. మీ నాన్న గెలిచేది చూసుకో!

Oknews

Leave a Comment