ByGanesh
Fri 27th Oct 2023 02:00 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ చక చకా ముగించేస్తున్నాడు. ప్రస్తుతం దేవర టీమ్ హైదరాబాద్ వదిలి గోవాకి పయనమైంది. గోవాలో ఎన్టీఆర్-హీరోయిన్ జాన్వీ కపూర్ పై రొమాంటిక్ సన్నివేశాల చిత్రకరణ చేపట్టారు కొరటాల. గోవా షెడ్యూల్ తర్వాత గోకర్ణ, అలాగే వైజాగ్ లలో నెక్స్ట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. ఇక ఎన్టీఆర్ అటు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది.
ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబోలో బడా మల్టీస్టారర్ గా వార్ 2 చిత్తాన్ని ఎనౌన్స్ చెయ్యడంతో ఇక్కడ ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతుంటే.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ మీడియా వరకు వార్ 2 వార్తలని కవర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదగడంతో ఇప్పుడు అతను ఏ ప్రాజెక్ట్ చేసినా దానిపై అందరి దృష్టి పడుతుంది. అయితే తాజాగా వార్ 2 పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వార్ 2 మూవీ షూటింగ్ మొదలు కావడమే కాదు.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా ఫినిష్ అయిందట. ఆయన్ ముఖర్జీ – హ్రితిక్ రోషన్ లు స్పెయిన్ లో వార్ 2 కి సంబందించిన ఒక షెడ్యూల్ పూర్తి చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యంగ్ టైగర్ కూడా డిసెంబర్లో వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కోట్లలో పారితోషకం తీసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది.
Exciting update on NTR War 2!:
Update on NTR War 2 Movie!