GossipsLatest News

హౌస్ మేట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున


బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి ఎంటర్ కాబోతుంది. ఈ వారం హౌస్ లో జరిగిన విషయాలపై నాగార్జున ఎప్పటిలాగే శనివారం ఎపిసోడ్ లో హౌస్ లో చాలామందిని నించోబెట్టి ఒక్కొక్కరికి ఇచ్చిపడేసారు. సీరియల్ బ్యాచ్ కి కాస్త గట్టిగానే ఇచ్చేసారు. ఆట ఆడినా బిహేవియర్ బాలేదు అంటూ ప్రిన్స్ యావర్, శోభలని నించిబెట్టి కడిగేశారు. భోలే ఎర్రగడ్డ అంటే తెగ ఉడికిపోయావు.. కానీ నువ్ యావర్ ని పిచ్చోడా అనొచ్చా అని శోభా శెట్టిని, అలాగే యావర్ గతంలోలా నువ్ చాలా ఎగ్రెసివ్ గా ఉంటున్నావ్ అంటూ క్లాస్ పీకారు.

ఇక అమరదీప్ ఫౌల్ గేమ్ గురించి, శివాజీ మాట మాటికీ వెళ్ళిపోతాను అన్నందుకు పంచాయితీ పెట్టారు. సందీప్ మాస్టర్ బొంగులో అన్న పదం వాడినందుకు సందీప్ కి క్లాస్ పీకారు. అలాగే నాగార్జున రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని మెచ్చుకుని జెండా ఎగరేయారు. ప్రియాంక, అర్జున్ అంబటి, ఇంకా అశ్విని లు బిహేవియర్ పరంగాను, అలాగే ఆట పరంగాను సూపర్ అంటూ వాళ్ళ ఫ్లాగ్స్ ఎగరేసిన నాగర్జున మిగతా హౌస్ మేట్స్ మొత్తానికి షాకిచ్చి టాగ్స్ విరగ్గొట్టారు.

ఇక శనివారం ఎపిసోడ్ చివరిలో ఒక్కో ఫోటోని నీళ్లలో వేసి ఎవరిది తేలితే వారు సేఫ్ అంటూ చెప్పిన నాగ్.. అందులో అమరదీప్, శోభా శెట్టి, భోలే, ప్రియాంక, శోభా శెట్టి, అశ్విని ఫోటోలు నీళ్లల్లో మునిగిపోగా.. గౌతమ్ ఫోటో, ప్రియాంక ఫొటోస్ మాత్రం నీళ్లలో తేలాయి. గౌతమ్, ప్రియాంక మీరు అన్నా చెల్లెళ్ళు సేఫ్ అంటూ నాగార్జున ఈ ఎపిపోడ్ ని ముగించారు. 





Source link

Related posts

Dharani Committee Submits Reports Shortly

Oknews

బుల్లితెర మీద గుంటూరు కారానికి గుడ్ రెస్పాన్స్

Oknews

పవన్.. ఇది చాలా టూ మచ్!

Oknews

Leave a Comment