Top Stories

విశాఖ గురించి ఉప రాష్ట్రపతి ఏమన్నారంటే….?


విశాఖకు ఎవరు వచ్చినా స్పందించకుండా ఉండలేరు. ఉప రాష్ట్రపతి దేశానికి ద్వితీయ పౌరుడు అయిన జగదీష్ ధంకర్ ఫస్ట్ టైం విశాఖ వచ్చారు. ఆయన విశాఖలో జరిగిన ఆంధ్రా వైద్య కళాశాల వందేళ్ల ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను కీర్తించారు. సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు. విశాఖ వైద్య రంగంలో వందేళ్ల క్రితమే ముందుందని ప్రశంసించారు. ఒక క్రమ పద్ధతి ప్రకారం విశాఖలోని ఆంధ్రా వైద్య కళాశాల ఎదిగింది అని ఆయన పేర్కొన్నారు.

విశాఖ గురించి ఉప రాష్ట్రపతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విశాఖ ఏపీలోనే కాదు దేశంలోనూ అంతర్జాతీయంగానూ ముఖ్యమైన నగరం అని అందరూ ఒప్పుకుంటారు. ఈ కారణంగానే విశాఖను పాలనా రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయింది అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

నీతి అయోగ్ 2047 నాటికి విశాఖను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని సౌతిండియాలోనే ఏకైక సిటీగా ఎంపిక చేసింది. విశాఖ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్న టైం లో రాజ్యంగ పదవులలో ఉన్న వారు సైతం గ్రేట్ సిటీ అంటున్నారు. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎంపిక చేసుకోవడం ద్వారా వైసీపీ కరెక్ట్ డెసిషన్ తీసుకుందనే అంతా అంటున్నారు. కోర్టులలో అనుకూల తీర్పు వస్తే విశాఖ ప్రగతి గతిని ఏవరూ ఆపలేరని అంటున్నారు.



Source link

Related posts

బాబు ఆరోగ్యంపై ఇంట్లోనే కుట్రా!

Oknews

మంచు విష్ణు సినిమాలో మరో సూపర్ స్టార్

Oknews

అతిపెద్ద విలీనం ఆగిపోయింది

Oknews

Leave a Comment