ByGanesh
Sat 28th Oct 2023 09:37 PM
మెగాస్టార్ చిరు తర్వాత అల్లు అర్జునే.. తగ్గేదేలే.. అంటూ BRS నేత కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో అభిమానులకి రిప్లై ఇస్తూ చిట్ చాట్ చెయ్యడం అల్లు అభిమానులకి చాలా ఖుషి చేసింది. అల్లు అర్జున్ కి పుష్ప సినిమాతో యావత్ భారతదేశంలో అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు వారితో పాటుగా రాజకీయనేత కల్వకుంట్ల కవిత తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమని.. తగ్గేదేలే అంటూ చేసిన ట్వీట్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది.. కల్వకుంట్ల కవిత తన అభిమాన హీరో ఎప్పటికి చిరంజీవే… ఆ తర్వాత అల్లు అర్జునే అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
గతంలో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకి ఇష్టమని, ఆయన డాన్స్ లంటే ఇంకా ఇష్టమని, తాను చిరు అభిమానిని అంటూ ఢిల్లీలో ఆయనతో స్వల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కల్వకుంట్ల కవిత.. తాజాగా సోషల్ మీడియా చిట్ చాట్ లో మీకు మెగాస్టార్ చిరు తర్వాత ఏ హీరో ఇష్టమని అడిగిన అభిమానితో.. అవును ఎప్పటికి చిరునే నాకు ఫెవరేట్ హీరో. ఆ తర్వాత అల్లు అర్జునే ఫెవరేట్, తగ్గేదేలే అంటూ సమాధానమివ్వడం ఇప్పుడు అల్లు అభిమానులకి మరింత ఉత్సాహాన్నిచ్చింది.
Allu Arjun after Chiranjeevi:
Allu Arjun after Chiranjeevi: Kalvakuntla Chiranjeevi